Ratan Tata: మనిషే సింపుల్.. ఇల్లు అంతకన్నా సింపుల్.. రతన్ టాటా చివరి వరకు నివసించింది ఇక్కడే..!

|

Oct 10, 2024 | 8:43 AM

మీకు అవకాశాలు వస్తాయని ఎదురుచూడకండి, మీ స్వంత అవకాశాలను సృష్టించుకోండి అంటూ టాటా గ్రూప్ సామ్రాజ్యాన్ని విస్తరించిన అసామాన్యుడు రతన్ టాటా.

Ratan Tata: మనిషే సింపుల్.. ఇల్లు అంతకన్నా సింపుల్.. రతన్ టాటా చివరి వరకు నివసించింది ఇక్కడే..!
Ratan Tata House
Follow us on

దేశ చరిత్రలో అక్టోబర్ 9 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే వేల కోట్లు, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహించిన రతన్ టాటా లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. రతన్ టాటా జీవితమంతా సింప్లిసిటీకి మారు పేరు. ఆయన జీవితాన్ని పరిశీలిస్తే రామాయణంలో జనకుని పాత్ర లాంటి ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి!

మీకు అవకాశాలు వస్తాయని ఎదురుచూడకండి, మీ స్వంత అవకాశాలను సృష్టించుకోండి అంటూ టాటా గ్రూప్ సామ్రాజ్యాన్ని విస్తరించిన అసామాన్యుడు రతన్ టాటా. రతన్ టాటా ఎలాంటి శ్రమైకజీవుడో తెలియడానికి రతన్ టాటా నోటి నుండి ఈ ఒక్క మాట చాలు. రతన్ టాటా 28 డిసెంబర్ 1937న ముంబైలో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెమ్‌షెడ్ జీ టాటా మనవడు నావల్ టాటా, సునీ దంపతులకు జన్మించారు. 10 సంవత్సరాల వయస్సులో 1948లో రతన్ తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో అతని అమ్మమ్మ నవజాబాయి సంరక్షణలో పెరిగారు.

రతన్ టాటా కంపెనీ టాటా మోటార్స్ ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటైన ‘జాగ్వార్’, ‘ల్యాండ్ రోవర్’లను తయారు చేస్తోంది. ప్రపంచంలో ఏ కారునైనా కొనగలిగేంత సంపద అతని వద్ద ఉంది. కానీ ఆయన చివరి రోజుల్లో ఎప్పుడూ నానో కారులో ప్రయాణించారు!

కొన్ని రోజుల క్రితం, అతను ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో, ప్రజలు అతని మరణంపై ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఆయనే స్వయంగా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఖండించారు. ఆ తర్వాత అదే నిజమైంది. అనుహ్యంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దాదాపు 3 దశాబ్దాల పాటు టాటా గ్రూపునకు నేతృత్వం వహించిన రతన్ టాటా తన చివరి క్షణాలను ‘బక్తవార్’ అనే ఇంట్లో గడిపారు. ఈ ఇంటిని ఒక్కసారి చూస్తే, ఇందులో ఐశ్వర్యం జాడ కనిపించదు.

రతన్ టాటా ఇల్లు ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఉంది. ‘భక్తవర్’ అంటే అదృష్టాన్ని తెచ్చేవాడు. ఇది రతన్ టాటా జీవితాంతం వర్తిస్తుంది. టాటా గ్రూప్‌నకు అధికారంలో ఉన్నప్పుడు, అతను మొత్తం గ్రూపునకు అదృష్టాన్ని తెచ్చే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో లండన్ స్టీల్ కంపెనీ ‘కోరస్’, టీ కంపెనీ ‘టెట్లీ’లను కొనుగోలు చేయడం జరిగింది.

రతన్ టాటా తన చివరి క్షణాలు గడిపిన ‘భక్తవర్’ ఇంట్లో అతని ప్రత్యక్ష ప్రభావం కనిపిస్తుంది. ఇల్లు సముద్రానికి ఎదురుగా ఉంటుంది. సరిగ్గా కోలాబా పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉంది. దీని వైశాల్యం 13,350 చ.అ. ఈ బంగ్లాలో 3 అంతస్తులు, 10-15 కార్లు పార్కింగ్ స్థలం ఉంది. ఈ ఇల్లు చాలా సులభమైన, పరిపూర్ణ డిజైన్‌‌తో రూపొందించారు. ఇది పూర్తిగా తెల్లగా పెయింట్ చేయడం జరిగింది. ఇంట్లో సూర్యరశ్మి పుష్కలంగా ఉండేలా పెద్ద కిటికీలు ఉపయోగించారు. ఇవి ఇంటి లివింగ్ రూమ్ నుంచి పడకగది వరకు కనిపిస్తాయి. మొత్తంగా చెప్పాలంటూ చాలా సింపుల్ ఇంట్లో చివరి వరకు నివసించారు రతన్ టాటా..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..