RSS: దేశ విభజన ఓ విచారకరమైన చరిత్ర.. నాగ్‌పూర్‌లో ఆయుధ పూజ నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్..

విజయ దశమి వేడుకలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాగ్‌పూర్‌లోని ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ ఆయుధ పూజను నిర్వహించారు.

RSS: దేశ విభజన ఓ విచారకరమైన చరిత్ర.. నాగ్‌పూర్‌లో ఆయుధ పూజ నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్..
Rss
Follow us

|

Updated on: Oct 15, 2021 | 11:21 AM

విజయ దశమి వేడుకలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాగ్‌పూర్‌లోని ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ ఆయుధ పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం స్వాతంత్ర్యం పొందిన రోజున స్వేచ్ఛ, సంతోషంతో పాటు చాలా బాధను అనుభవించామన్నారు. దేశ విభజన కలిగించిన నొప్పి ఇంకా వెంటాడుతోందని అన్నారు. విభజనకు దారితీసిన పరిస్థితులు పునరావృతం కాకూడదని అన్నారు. ఆ రోజు మనం కోల్పోయిన సమగ్రత, ఐక్యతను తిరిగి తీసుకురావాలంటే ఆ చరిత్ర అందరికీ తెలియాలియాలన్నారు. ముఖ్యంగా ఈ యువ తరం ఆరోజు జరిగిన సంఘటనలను తెలుసుకోవాలన్నారు. పోగొట్టుకున్నది తిరిగి రావచ్చు.., పోగొట్టుకున్నది తిరిగి పోగొట్టుకోవచ్చు.. కానీ మతం, కులం, భాష, ప్రాంతీయతల వంటి సంకుచిత అహాన్ని విడిచిపెట్టాలన్నారు మోహన్ భగవత్.

స్వేచ్ఛ అనేది ఒక్కరోజులో రాలేదు

మనం ఈ ఏడాది 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. 1947 ఆగస్టు 15 న మనం స్వతంత్రం పొందాము. మనకు లభించిన ఈ స్వేచ్ఛ ఒక్క రాత్రిలో రాలేదన్నారు. ఎందరో మహా వీరుల త్యాగాల వల్ల మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ లభించిందని ఆయన గుర్తు చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి అన్ని కులాల నుండి వచ్చిన వీరులు హిమాలయాల తపస్సు , త్యాగం వల్ల ఈ మన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.

భారతదేశ ప్రజలను తప్పుదోవ పట్టించే పని..

మన ప్రయాణం ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రపంచంలో భారతదేశ పురోగతి, గౌరవనీయమైన స్థానానికి ఎదగడం వంటి అంశాలను నేటి తరం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అయితే కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం హాని కలిగించేందుకు రెడీగా ఉన్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి: RK: పోలీసులు చెబుతుంటే తెలిసింది తప్ప.. పార్టీ నుంచి సమాచారం రాలేదు.. కుటుంబ సభ్యుల కామెంట్..

Dasara – Jimmy: దసరా రోజున జమ్మి చెట్టును ఇలా పూజిస్తే.. కుబేరుడు మీ ఇంట్లో..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో