Rashtrapati Bhavan : సందర్శకుల కోసం తెరుచుకోనున్న రాష్ట్రపతి భవన్ ద్వారాలు.. కానీ ఇవి పాటించండి..

|

Feb 02, 2021 | 6:00 PM

దాదాపు పది నెలల తర్వాత రాష్ట్రపతి భవన్ సందర్శకుల కోసం తెరుచుకోనుంది. సందర్శనకు తిరిగి అనుమతిస్తున్నట్లుగా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6 నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుందని..

Rashtrapati Bhavan : సందర్శకుల కోసం తెరుచుకోనున్న రాష్ట్రపతి భవన్ ద్వారాలు.. కానీ ఇవి పాటించండి..
Follow us on

Rashtrapati Bhavan : దాదాపు పది నెలల తర్వాత రాష్ట్రపతి భవన్ సందర్శకుల కోసం తెరుచుకోనుంది. సందర్శనకు తిరిగి అనుమతిస్తున్నట్లుగా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6 నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. కోవిడ్ ప్రభావంతో గత ఏడాది మార్చి 13 నుంచి సందర్శకులను నిలిపివేసింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి భవన్​లో కరోనా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత సందర్శకులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

సందర్శకులు ఇవి పక్కాగా పటించాలి..

కరోనా కట్టడికి మాస్క్​ ధరించడం, భౌతిక దూరం పాటించడంతోపాటు కరోనా​ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.  ప్రతి శనివారం, ఆదివారం సందర్శకులకు అవకాశం ఉంటుంది. గతంలో విధంగానే.. రాష్ట్రపతి భవన్ వెబ్​సైట్​ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

SpaceX Launch Schedule : ఆ నలుగురితో యాత్రకు సిద్ధమవుతున్న ‘స్పేస్‌ఎక్స్’.. ఈ ఏడాది చివరినాటికి అంతరిక్షంలోకి..

ICC Player of The Month : ఐసీసీ కొత్త అవార్డులు.. నామినీల్లో టీమిండియా ఆటగాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌