Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్‌ను సందర్శించాలనుకుంటున్నారా..? మీకు ఇదే మంచి అవకాశం..

రాష్ట్రపతి అంటే దేశానికి ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు. అలాంటి ప్రథమ వ్యక్తి నివసించే అధికార భవనాన్ని ఒక్క సారైనా సందర్శించాలని అందరికీ కలిగే కోరికే. అలాంటి..

Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్‌ను సందర్శించాలనుకుంటున్నారా..? మీకు ఇదే మంచి అవకాశం..
Rashtrapati Bhavan

Updated on: Nov 22, 2022 | 11:15 AM

రాష్ట్రపతి అంటే దేశానికి ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు. అలాంటి ప్రథమ వ్యక్తి నివసించే అధికార భవనాన్ని ఒక్క సారైనా సందర్శించాలని అందరికీ కలిగే కోరికే. అలాంటి కోరికను తీర్చేందుకు రాష్ట్రపతి భవన్.. డిసెంబర్ 1 నుంచి మొదటి వారంలోని ఐదు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంటుందని సోమవారం తన అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. గెజిటెడ్ సెలవులు మినహా బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో ప్రజలు అనుమతిస్తామని తెలిపింది.

అయితే ఒక్కొక్కరికి ఒక గంట చొప్పున ఐదు విడతలలో.. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు సందర్శనకు అనుమతిస్తున్నామని ప్రకటనలో పేర్కొంది. ఇంకా గెజిటెడ్ సెలవులు మినహా మంగళవారం నుంచి ఆదివారం వరకు వారానికి ఆరు రోజులు చొప్పున రాష్ట్రపతి భవన్ మ్యూజియం కాంప్లెక్స్‌ను కూడా ప్రజలు సందర్శించవచ్చని రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్రపతి భవన్ భారత రాష్ట్రపతి అధికారిక నివాసం. ప్రతి శనివారం, ప్రజలు రాష్ట్రపతి భవన్ ఫోర్‌కోర్టులో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు గార్డ్ మార్పు వేడుకను కూడా చూడవచ్చు. శనివారాలు గెజిటెడ్ సెలవులు, ముందస్తుగా ప్రకటించిన సెలవు రోజులలో ఈ ఈవెంట్ జరగదు. కాగా, రాష్ట్రపతి భవన్‌ను సందర్శించాలనుకునేవారు ముందుగా http://rashtrapatisachivalaya.gov.in/rbtour వెబ్‌సైట్ ద్వారా తమ స్లాట్‌లను బుక్ చేసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..