Women in Army: భారత సైన్యంలో చేరిన 30 మంది మహిళలు.. 4 సంవత్సరాల శ్రమకు ఫలితం..

శిక్షణ కాలంలో రాణించి పతకాలు సాధించిన వారికి బహుమతులు అందజేశారు. ఆర్మీలో చేరడం గురించి ఫైనల్ ఎగ్జామ్‌లో టాపర్‌గా నిలిచిన..

Women in Army: భారత సైన్యంలో చేరిన 30 మంది మహిళలు.. 4 సంవత్సరాల శ్రమకు ఫలితం..
Women In Army
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 02, 2023 | 2:18 PM

భారత సైన్యంలో 30 మంది మహిళలు స్థానం సంపాదించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఆర్మీ మెడికల్ కార్ప్స్ కార్యాలయంలో కొత్తగా 30 మంది మహిళా నర్సులు ఆర్మీలో చేరారు. ఆర్మీ మేజర్ జనరల్ పంకజ్ రావు, బ్రిగేడియర్ ఆర్. జయంతి, కల్నల్ ఎస్. గీత కూడా పాల్గొన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా కుగ్రామాలు, సైనిక ఆసుపత్రులలో పని చేస్తున్న, కరోనా మహమ్మారి సమయంలో సైనిక సేవ కోసం శిక్షణ పొందిన 30 మంది మహిళా నర్సులు ఈ కార్యక్రమం ద్వారా సైన్యంలో చేరారు. వీరు నర్సింగ్ ఆఫీసర్‌గా పని చేయనున్నారు.

శిక్షణ కాలంలో రాణించి పతకాలు సాధించిన వారికి బహుమతులు అందజేశారు. ఆర్మీలో చేరడం గురించి ఫైనల్ ఎగ్జామ్‌లో టాపర్‌గా నిలిచిన దివ్య శర్మ మాట్లాడుతూ.. మిలటరీ నర్సింగ్‌లో చేరాలనేది తన కల చెప్పారు… తన సోదరుడు మునిష్టన్‌ తనను ప్రోత్సహించాడని చెప్పారు.

“మా తాత నందన్ మెహ్రా మరియు తండ్రి రాజేష్ మెహ్రా ఆర్మీలో పనిచేశారు. కాబట్టి నేను సైన్యంలో చేరాలనే ఆసక్తితో వచ్చానని చెప్పారు. “మా తాత మహితాబ్ సింగ్ రావ్ డిఫెన్స్ ఫోర్స్ లో ఉండేవారు. నేను కూడా ఆర్మీలో చేరాలని అనుకున్నాను. నా కోరికకు ఈ నర్సింగ్ ఉద్యోగం చాలా సరిపోయింది అని ఆయుషి రావు ఆనందంగా చెప్పారు. తన్వీర్ కౌర్ తండ్రి మంజీందర్ సింగ్, యుక్యతా యాదవ్ తండ్రి హనుమాన్ సింగ్ యాదవ్ వైమానిక దళంలో పనిచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.