వీడియో: ర్యాపిడో బైకర్లు.. ఇది చూసైనా జాగ్రత్త పడండి! గాల్లోకి పక్షిలా ఎగిరాడు..!

కారును బైక్‌ ఢీ కొన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అయితే ఆ వీడియో ర్యాపిడోలో బైక్‌ నడిపే వారికి ఓ హెచ్చరికగా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ ప్రమాదం ఎక్కడ జరిగింది? ప్రమాదంలో గాయపడిన ఆ ర్యాపిడో బైకర్‌ ఇప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

వీడియో: ర్యాపిడో బైకర్లు.. ఇది చూసైనా జాగ్రత్త పడండి! గాల్లోకి పక్షిలా ఎగిరాడు..!
Rapido Accident

Edited By:

Updated on: Feb 17, 2025 | 3:33 PM

వేగం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి వేగం కారణంగా క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించకుండా అతి వేగంగా, నిర్లక్ష్యంగా నిడిపితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడం కష్టం. ఇప్పటికే చాలా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు బోలెడు చూసి ఉంటారు. అయితే జీవనోపాధి కోసం ర్యాపిడోలో బైకర్‌గా పనిచేస్తున్న ఓ కుర్రాడు అతి వేగం కారణంగా ప్రమాదానికి గురయ్యాడు. ఆ యాక్సిడెంట్‌ జరిగిన సమయంలో ఆ దృశ్యాలు అక్కడున్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. ఆ ఫుటేజ్‌ను ఎవరో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. చాలా ఫాస్ట్‌గా వచ్చిన ఓ ర్యాపిడో బైకర్‌ కారును ఢీకొని గాల్లోకి పక్షిలా ఎగిరిన దృశ్యాలు అందులో మనం చూడొచ్చు.

ఈ సంఘటన లక్నోలోని ఇందిరా నగర్ సెక్టార్ 13లో జరిగింది. ఓ స్విఫ్ట్ కారును మూల మలుపు వద్ద కాస్త నిదానంగానే మలుపు తిరిగింది. కానీ, ఎదురుగా వస్తున్న ఓ ర్యాపిడో బైకర్‌ వేగంగా రావడంతో అతను కార్‌ను ముందు నుంచి ఢీకొట్టాడు. అతి వేగం కారణంగా బ్రేక్‌ వేయడానికి సరైన విధంగా స్పందించడానికి అతని వద్ద టైమ్‌ లేకుండా పోయింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ కావడంతో ఘటనపై పోలీసులు స్పందించారు. అభిజీత్ శ్రీవాస్తవ అనే బైకర్ అతి వేగంగా బైక్‌ నడుపుతూ మలుపు వద్ద తిరుగుతున్న కారును ఢీకొట్టినట్లు పోలీసుల తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. స్థానికులు తీవ్రంగా గాయపడిన శ్రీవాస్తవను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ఇందులో పూర్తిగా బైకర్‌దే తప్పు. మలుపు దగ్గర అతను వేగాన్ని తగ్గించాలి. కారు నెమ్మదిగా ఉంది, నార్మల్‌గా టర్నింగ్‌ తీసుకుంది. ఇంత చిన్న రోడ్లలో మలుపు సమయంలో, కారు కచ్చితంగా రోడ్డును ఎక్కువగా కవర్‌ చేస్తుంది. అందుకే ఇలాంటి చోట్ల ఎవరైనా కాస్త నిదానంగానే వెళ్లాలి. మూల మలుపులో ఎప్పుడు ఏ వాహనం వస్తుందో చెప్పలేం కదా.. మీ జీవితం గురించి కూడా ఆలోచించండి అంటూ ఓ నెటిజన్‌ రాసుకొచ్చాడు. మరి ఈ వీడియో చూసిన తర్వాతనైనా అతి వేగంగా, నిర్లక్ష్యంగా బైక్‌ నడిపై వాళ్లు, ముఖ్యంగా కొంతమంది ర్యాపిడో బైకర్లు ఇకనైనా జాగ్రత్త పడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.