‘అయోధ్యలో ఆలయ నిర్మాణం ఆరంభమైంది’

| Edited By: Pardhasaradhi Peri

Aug 20, 2020 | 6:38 PM

అయోధ్యలో ఆలయ నిర్మాణం ఆరంభమైందని రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఢిల్లీలో గురువారం సమావేశమైన ఈ ట్రస్ట్ సభ్యులు ఈ విషయాన్ని తెలియజేస్తూ..

అయోధ్యలో ఆలయ నిర్మాణం ఆరంభమైంది
Follow us on

అయోధ్యలో ఆలయ నిర్మాణం ఆరంభమైందని రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఢిల్లీలో గురువారం సమావేశమైన ఈ ట్రస్ట్ సభ్యులు ఈ విషయాన్ని తెలియజేస్తూ, మరో 36-40 నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి కాగలదన్న ఆశాభావాన్ని  వ్యక్తం చేశారు. ప్రస్తుతం రూర్కీకి చెందిన సెంట్రల్ బిల్డింగ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్ టిట్యూట్ , చెన్నై ఐఐటీ, లార్సెన్ అండ్ టూబ్రో సంస్థలు మందిర స్థలం వద్ద మట్టి నమూనాలను పరీక్షిస్తున్నాయని వారు ట్వీట్ చేశారు. భారత పురాతన, సాంప్రదాయక పద్ద్దతుల్లో ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. మందిర నిర్మాణంలో ఇనుమును వాడే ప్రసక్తే  లేదన్నారు.గుడి నిర్మాణానికి రాగి పలకలను సమర్పించే భక్తులు వాటిపై తమ పేర్లను, తామున్న ప్రాంతాల పేర్లను  చెక్కించవచ్ఛునని ట్రస్ట్ సభ్యులు వివరించారు.