Raksha Ka Bandhan: డ్రైవర్లు కేవలం వాహనాలను నడిపేవారు కాదు.. మాటలేమీ చెప్పని మౌన సహోదరులు

Raksha Ka Bandhan: ‘రక్షా కా బంధన్ – టాటా ట్రక్స్, దేశ్ కే ట్రక్స్’ అనే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆ లేఖలు కర్మాగారం గోడలు దాటి, దేశం నలుమూలలా ఉన్న హైవేలపైకి ప్రయాణించాయి. ఆ లేఖల్లో కృతజ్ఞత..

టాటా మోటార్స్‌ జంషెడ్‌పూర్‌ ప్లాంట్‌లో రక్షాబంధన్‌ కేవలం ఒక పండుగలా కాదు .. మనసుకు హత్తుకునే అనుభూతిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం దేశంలోనే అత్యంత నమ్మకమైన, సురక్షితమైన ట్రక్కులను తయారు చేసే దుర్గా లైన్ మహిళా సిబ్బంది.. తమకు ఎప్పుడూ కలవని ట్రక్ డ్రైవర్లకు, తమ తెలియని అన్నలకి స్వహస్తాలతో లేఖలు రాశారు.

‘రక్షా కా బంధన్ – టాటా ట్రక్స్, దేశ్ కే ట్రక్స్’ అనే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆ లేఖలు కర్మాగారం గోడలు దాటి, దేశం నలుమూలలా ఉన్న హైవేలపైకి ప్రయాణించాయి. ఆ లేఖల్లో కృతజ్ఞత, గౌరవం, శుభాకాంక్షల సందేశాలు ఉన్నాయి. ఈ మహిళల దృష్టిలో ఆ డ్రైవర్లు కేవలం వాహనాలను నడిపేవారు కాదు. వారు దేశ ఆశలను మోసుకెళ్లే, మాటలేమీ చెప్పని మౌన సహోదరులు.

ప్రతి రాఖీతో పాటు ఒక లేఖ – ప్రతి లేఖ వెనుక కష్టపడి తయారు చేసిన, క్రాష్-టెస్ట్ చేసిన సురక్షిత అల్ట్రా, సిగ్నా, ప్రిమా ట్రక్కుల అసెంబ్లీ లైన్‌ నుంచి వచ్చిన స్వరం ఉంది. ముఖం చూడకపోయినా, ఆ పదాల్లోని ప్రేమ, పరామర్శ హృదయానికి తాకుతుంది. ఈ కార్యక్రమం ద్వారా టాటా మోటార్స్ తమ ట్రక్కుల బలం, భద్రతను మాత్రమే కాదు. వాటిని నిర్మించే వారిని, నడిపించే వారిని నమ్మకం, కర్తవ్యబోధతో కలిపే ఆ అనుబంధాన్ని కూడా జరుపుకుంటుంది.