Rajiv Gandhi Jayanti 2021: రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాహుల్ గాంధీ.. వర్షంలో తడుస్తూనే.. – Watch Video

|

Aug 20, 2021 | 4:59 PM

Rajeev Gandhi Jayanti: ధివంగత మాజీ ప్రధాని, భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.

Rajiv Gandhi Jayanti 2021: రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాహుల్ గాంధీ.. వర్షంలో తడుస్తూనే.. - Watch Video
Rahul Gandhi
Follow us on

Rajeev Gandhi Jayanti: ధివంగత మాజీ ప్రధాని, భారత రత్న రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆయన తనయుడు, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. వర్షంలో తడుస్తూనే రాజీవ్ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి అర్పించారు. రాజీవ్ గాంధీ అమర్ రహే అంటూ ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. భారీ సంఖ్యలో ఆ పార్టీ యువ కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. వారిని రాహుల్ గాంధి అభినందించారు.

అటు యూత్ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ ఫోటో ఎగ్జిబిషన్‌ను రాహుల్ గాంధీ తిలకించారు. రాజీవ్ గాంధీ ఆకర్షణీయమైన ఫోటోను తన సెల్‌ఫోన్‌లో బంధించారు.

అంతకు ముందు వీర్ భూమి వద్ద రాహుల్ గాంధీ.. రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు.

అటు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ కార్యాలయాల్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పంజాబ్‌లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ సిద్ధూ పాల్గొని నివాళులర్పించారు..

Also Read..

ఉగ్రవాదులకు రాజ్యాన్ని పాలించే హక్కు లేదు.. తాలిబన్లపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు!

క్లిక్.. క్లిక్.. ఫోటోగ్రాఫర్‌గా కొత్త అవతారమెత్తిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రే