నళినికి మరో మూడు వారాల పెరోల్ పొడిగింపు

| Edited By:

Aug 22, 2019 | 11:52 PM

భారత మాజీ ప్రధాని రాజీవ్ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న నళినికి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన పెరోల్ మరో మూడు వారాలకు పొడిగించింది. తన కుమార్తె వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదని, లండన్‌లో ఉంటున్న తన కుమార్తె సెప్టెంబర్ మొదటి వారంలో భారత్‌కు వస్తుందని, ఆమె వచ్చిన తర్వాత వివాహ ఏర్పాట్ల నిమిత్తం కొంత సమయం ఇవ్వాల్సిందిగా కోర్టును అభ్యర్థించింది. నళిని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఆమెకు మరో మూడు వారాల గడువును […]

నళినికి మరో మూడు వారాల పెరోల్ పొడిగింపు
Follow us on

భారత మాజీ ప్రధాని రాజీవ్ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న నళినికి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన పెరోల్ మరో మూడు వారాలకు పొడిగించింది. తన కుమార్తె వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదని, లండన్‌లో ఉంటున్న తన కుమార్తె సెప్టెంబర్ మొదటి వారంలో భారత్‌కు వస్తుందని, ఆమె వచ్చిన తర్వాత వివాహ ఏర్పాట్ల నిమిత్తం కొంత సమయం ఇవ్వాల్సిందిగా కోర్టును అభ్యర్థించింది. నళిని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఆమెకు మరో మూడు వారాల గడువును పొడిగిస్తూ ఆదేశించింది. నళిని జూలై 25న పెరోల్‌పై విడుదలైంది.

మే 21, 1991లో తమిళనాడు కంచిపురం జిల్లా శ్రీపెరంబదూర్ వద్ద జరిగిన రాజీవ్ గాంధీ హత్యకేసులో నళిని శ్రీహరన్ గత 27 ఏళ్లుగా వేలూరు మహిళా జైలులో శిక్ష అనుభవిస్తుండగా. ఆమె భర్త వేలూరు పురుషుల జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.