తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. తగలబడ్డ 2 భోగీలు!

హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఆగి ట్రైన్‌లో మంటలు చెలరేగిన ఘటన మరువకముందే తాజాగా అలాంటిదే మరో సంఘటన వెలుగు చూసింది. తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో రైలులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు చెలరేగాయి. రాజస్థాన్ కోట రైల్వే డివిజన్‌లోని విక్రమ్‌గఢ్ ఆలోట్ - లూనీరిచా స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది.

తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. తగలబడ్డ 2 భోగీలు!
Rajdhani Express Fire

Updated on: May 17, 2026 | 10:45 AM

కేరళలోని తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురైంది. ట్రైన్ మధ్యప్రదేశ్‌లోని లూనీరిచ్ఛా-విక్రమ్‌గఢ్ ఆలోట్ స్టేషన్ల మధ్యకు రాగానే తెల్లవాుజామున 5:15 గంటల సమయంలో మంటలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్‌-12431లో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల B-1 కోచ్‌లో మొదలైన మంటలు.. క్షణాల్లోనే మిగతా భోగీలకు వ్యాపించాయి. మంటలు గుర్తించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది 2 బోగీలను మిగతా వాటి నుంచి విడదీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

ఇక వెంటనే సమాచారం అందుకున్న రైల్వే సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై కోట పీఆర్వో ప్రకటన జారీ చేసింది. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పేర్కొంది. అయితే ప్రమాదం కారణంగా ఈ రూట్‌లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది. ట్రాక్‌ను పునరుద్ధరిస్తున్నామని.. త్వరలోనే మళ్లీ రాకపోకలు మొదలవుతాయని తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us