Rajasthan: కోట జిల్లా మార్కెట్లో పట్టపగలు గన్ లతో దుండగుల కాల్పులు….. ఎందుకో మరి ??

రాజస్థాన్ లోని కోట జిల్లా మార్కెట్లో పట్టపగలు ఇటీవల దుండగులు కొందరు గన్ లతో కాల్పులు జరిపారు. సబ్జి మండిలో జరిగిన ఈ ఘటనలో ఓ షాపు యజమాని గాయపడకుండా తప్పించుకున్నాడు.

Rajasthan: కోట జిల్లా మార్కెట్లో పట్టపగలు గన్ లతో దుండగుల కాల్పులు..... ఎందుకో మరి ??
Six Attackers Open Fire

Edited By: Phani CH

Updated on: Jun 15, 2021 | 1:18 PM

రాజస్థాన్ లోని కోట జిల్లా మార్కెట్లో పట్టపగలు ఇటీవల దుండగులు కొందరు గన్ లతో కాల్పులు జరిపారు. సబ్జి మండిలో జరిగిన ఈ ఘటనలో ఓ షాపు యజమాని గాయపడకుండా తప్పించుకున్నాడు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దుండగుల కాల్పుల సీన్ స్పష్టంగా కనిపించింది. కైలాష్ మీనా అనే షాపు యజమాని ఇంట్లో ఉండగా అతని పేరు పెట్టి పిలిచిన వీరు ఆయన బయటికి రాగానే కాల్పులు జరిపారు. రెండు బైక్ లపై ఆరుగురు యువకులు వచ్చారని, వారు ఎందుకు తనపై హత్యాయత్నం చేశారో తెలియదని మీనా అంటున్నాడు. పండ్లు, కూరగాయల కమిషన్ ఏజెంట్ అయిన ఈయన కొన్నేళ్లుగా ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.. తనకెవరూ శతృవులు లేరని, అలాంటిది వాళ్ళు తనను టార్గెట్ చేయడానికి గల కారణాలు తెలియడం లేదని ఆయన చెప్పాడు. మీనా ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్పాట్ ను పరిశీలించారు. దుండగుల్లో ఎవరినీ తాను గుర్తించలేననని మీనా చెప్పాడు. కాగా కైలాష్ మీనా ఈ మండిలో తోటి వ్యాపారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటాడని తెలిసింది. బహుశా అది దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఈ యువకులను ప్రోత్సహించి ఉంటారా అని పోలీసులు భావిస్తున్నారు. అయితే త్వరలోనే వీరిని పట్టుకుని అరెస్ట్ చేస్తామని అన్నారు.

2007 లో కైలాష్ మీనాకు..లిఖాయత్ అనే వ్యక్తికి మధ్య ఘర్షణ జరిగిందని, బహుశా దాన్ని మనసులో ఉంచుకుని పగతో లిఖాయత్ వీరిని పంపి ఉంటాడా అని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. ఏమైనా ఈ ఘటనతో మార్కెట్లోని వారంతా భయాందోళనతో పారిపోయినంత పని చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Karthika Deepam: మోనిత రచ్చ చేస్తే ఏం చేస్తావని కొడుకుని ప్రశ్నించిన సౌందర్య.. తన నిజ స్వరూపం కార్తీక్ కు చూపించనున్న మోనిత

TVS Apache RTR : టీవీఎస్ అపాచీపై బంపర్ ఆఫర్..!10,000 రూపాయలు తగ్గింపు.. ఇప్పుడు ధర ఎంతో తెలుసా..?