Rajasthan: ఏడు పదుల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. పెళ్లైన 54 ఏళ్లకు..

|

Aug 10, 2022 | 1:58 PM

పెళ్లయిన 54 ఏళ్లకు ఓ జంట తల్లిదండ్రులయ్యారు. అమ్మ, నాన్న అనే పిలుపుకోసం వారి నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన అల్వర్‌లో నివాసముంటున్న మాజీ సైనికుడు గోపీచంద్‌ (75), చంద్రావతి (70)కి 1968లో వివాహం జరిగింది..

Rajasthan: ఏడు పదుల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. పెళ్లైన 54 ఏళ్లకు..
Ivf Technology
Follow us on

At the age of 70 woman gives birth to first child: పెళ్లయిన 54 ఏళ్లకు ఓ జంట తల్లిదండ్రులయ్యారు. అమ్మ, నాన్న అనే పిలుపుకోసం వారి నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన అల్వర్‌లో నివాసముంటున్న మాజీ సైనికుడు గోపీచంద్‌ (75), చంద్రావతి (70)కి 1968లో వివాహం జరిగింది. అప్పటి నుంచి పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. గోపీచంద్‌ తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంతో తమ వంశం తనతోనే అంతం అవుతుందేమోనని చాలా దిగుతుల పడ్డాడు. ఐతే 9 నెలల క్రితం ఈ జంట ఓ ఆసుపత్రిలో ఐవీఎఫ్‌ నిపుణుడైన డాక్టర్‌ పంకజ్‌ గుప్తాను సంప్రదించారు. తొలి రెండు యత్నాలు విఫలమైనా.. మూడో ప్రయత్నంలో వారి కల సఫలమైంది. దీంతో వివాహం జరిగిన దాదాపు 54 యేళ్లకు గోపీచంద్‌, చంద్రావతి దంపతులు సోమవారం (ఆగస్టు 8) మగబిడ్డకు జన్మనిచ్చారు.

7 పదుల వయసులో తల్లిదండ్రులవడం రాష్ట్రంలో ఇదే తొలిసారని, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వృద్ధ జంటలు 70-80 ఏళ్ల వయస్సులో తల్లిదండ్రులు అయ్యారని, ఇప్పడు IVF టెక్నాలజీతో ఇదంతా సాధ్యమవుతుందని డాక్టర్ పంకజ్ గుప్తా మీడియాకు తెలిపారు. వైద్యపరంగా చూస్తే.. 40 అంతకంటే ఎక్కువ వయస్సున్న మహిళలకు IVF ద్వారా సంతానం కలిగే అవకాశం 20% ఉంది. ఐతే ప్రతి యేట సక్సెస్‌ రేటు 2-3% తగ్గుతూ వస్తోంది. 45 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలు IVF చికిత్స ద్వారా గర్భం దాల్చే అవకాశం కేవలం 3 నుంచి 1 శాతం మాత్రమే ఉంది. ఇటువంటి సందర్భంలో కూడా 70 యేళ్ల వృద్ధ మహిళ ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడం ఆ దంపతుల అదృష్టమని డాక్టర్‌ పంకజ్‌ గుప్తా తెలిపారు.