
అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతుంది. ఏకంగా ప్రతిపక్ష పార్టీ అసమ్మతి నేతల ఇంటికి స్వయాన ముఖ్యమంత్రి వెళ్ళడం సంచలనం సృష్టిస్తోంది. రాజస్థాన్‌లో భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే సూర్‌సాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే సూర్యకాంత వ్యాస్‌కు ఈసారి టిక్కెట్ దక్కలేదు. ఈ విషయం తెలుసుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రంగంలోకి దిగారు. బీజేపీని టార్గెట్ చేస్తూ.. తనను పొగిడిన ఎమ్మెల్యేల టిక్కెట్లను ప్రత్యర్థి పార్టీ కొల్లగొట్టిందని అరోపించారు. అదే సమయంలో అర్థరాత్రి 12.30 గంటలకు అశోక్ గెహ్లాట్ స్వయంగా అసమ్మతి బీజేపీ నేత సూర్యకాంత వ్యాస్ ఇంటికి చేరుకున్నారు.
అర్థరాత్రి 12.15 గంటలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బీజేపీ ఎమ్మెల్యే సూర్యకాంత వ్యాస్ ఇంటికి చేరుకుని ఆమెను కలిశారు. ఈసారి బీజేపీ తమ అభ్యర్థుల జాబితా నుండి సూర్యకాంతను తప్పించింది. దీనిపై అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. సూర్‌సాగర్ బీజేపీ ఎమ్మెల్యే సూర్యకాంత వ్యాస్‌ను కలిసేందుకు సీఎం గెహ్లాట్ వచ్చినప్పుడు.. తన సోదరుడు తనను పొగిడాడని, అందుకే బీజేపీ తనకు ఈసారి టికెట్ ఇవ్వలేదని సూర్యకాంత సీఎం అశోక్ గెహ్లాట్ దృష్టికి తీసుకువచ్చారు.
మరోవైపు ఇప్పటి వరకు సూర్‌సాగర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టలేదు. రాజస్థాన్‌లోని సూర్‌సాగర్ సీటుపై కాంగ్రెస్ ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అభ్యర్థి పేరును ప్రకటించకపోవడంతో సీఎం సూర్యకాంత భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీకి కంచుకోట అయిన సూర్‌సాగర్‌ను కాంగ్రెస్ గెలవడం అంత తేలికైన విషయం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2003 నుంచి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే విజయ ఢంకా మోగిస్తూ వస్తున్నారు. ఇది మాత్రమే కాదు, బీజేపీ ఎమ్మెల్యే సూర్యకాంత వ్యాస్ ఇక్కడ నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 20 ఏళ్లుగా ఇక్కడ కాంగ్రెస్ గెలవలేకపోయింది.
అయితే, ఇప్పుడు సూర్యకాంత వ్యాస్‌కు టికెట్ ఇవ్వకపోవడం బీజేపీకి కాస్తా ఇబ్బందిని కలిగిస్తుంది. ఇదిలా ఉండగా, బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటికి సీఎం గెహ్లాట్ స్వయంగా రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సారి ఎలాగైనా సూర్‌సాగర్ స్థానాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసందుకు పావులు కదుపుతున్నారు ముఖ్యమంత్రి గెహ్లాట్. చూడాలి మరీ.. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు మారి.. సూర్‌సాగర్ స్థానం ఎవరికి దక్కుతుందో..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…