Raja Pateria: రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని చంపేందుకు సిద్ధంగా ఉండాలి : కాంగ్రెస్‌ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

|

Dec 12, 2022 | 2:13 PM

ఓ కాంగ్రెస్‌ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏకంగా మోడీని చంపాలంటూ కార్యకర్తలకు పిలుపునివ్వడం బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు..

Raja Pateria: రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని చంపేందుకు సిద్ధంగా ఉండాలి : కాంగ్రెస్‌ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Raja Pateria
Follow us on

ఓ కాంగ్రెస్‌ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏకంగా మోడీని చంపాలంటూ కార్యకర్తలకు పిలుపునివ్వడం బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి రాజా పట్రియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని చంపేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పన్నా జిల్లా పొవై తహసీల్‌లో కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వివాదాస్పద ప్రసంగం చేయడం సంచలనంగా మారింది. ప్రధాని మోదీ మతం, కులం, భాష ప్రాతిపదికన ప్రజలను విభజిస్తున్నారని, దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని పట్రియా వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రాజా పట్రియాను వెంటనే అరెస్టు చేయాలని పలువురు బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.ఇది క్షమించరాని నేరమని కేంద్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. భారత్‌ జోడో యాత్ర చేస్తున్నట్లు నటిస్తున్న వారి అసలు రూపం బయటకు వస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీ నిజమైన సెంటిమెంట్‌ను బహిర్గం చేశాయని అన్నారు. దేశ ప్రజలు మోడీనో ఎంతో అభిమానిస్తున్నారని, ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి