AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha Train Accident: ఇంకా గుర్తించని 83 మృతదేహాలు.. చివరికి దాని సహాయంతో గుర్తిస్తున్న అధికారులు

ఒడిశాలోని మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు మృతుల్లో 83 మందిని ఇంకా గుర్తించలేదు. అందుకోసం రైల్వేశాఖ అధునాతన సాంకేతికత వైపు ఆధారపడుతోంది. వేలిముద్రలు, సిమ్‌కార్డు సహా ఏదైన చిన్న ఆధారం దొరికినా మృత దేహాలను అప్పగించాలని ప్రయత్నాలు చేస్తోంది.

Odisha Train Accident: ఇంకా గుర్తించని 83 మృతదేహాలు.. చివరికి దాని సహాయంతో గుర్తిస్తున్న అధికారులు
Odisha Train Accident
Aravind B
|

Updated on: Jun 08, 2023 | 12:39 PM

Share

ఒడిశాలోని మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు మృతుల్లో 83 మందిని ఇంకా గుర్తించలేదు. అందుకోసం రైల్వేశాఖ అధునాతన సాంకేతికత వైపు ఆధారపడుతోంది. వేలిముద్రలు, సిమ్‌కార్డు సహా ఏదైన చిన్న ఆధారం దొరికినా మృత దేహాలను అప్పగించాలని ప్రయత్నాలు చేస్తోంది. మొదటగా మృతుల వేలి ముద్రలు సేకరించి.. వారి ఆధార్ కార్టు వివరాల ద్వారా కుటుంబ సభ్యలు గురించి తెలుసుకునేందుకు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) బృందాన్ని బాలేశ్వర్‌కు పలిపించాలని అనుకున్నారు. కానీ ఈ ప్రమదంలో చాలామంది చేతి వేళ్లు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ఇది ఫలించలేదు.

ఇప్పుడు కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే సంచార్ సాథీ పోర్టల్‌ను వినియోగిస్తున్నారు. 64 మృతదేహాలను ఈ పోర్టల్‌ ఆధారంగా పరీక్షించగా 45 కేసుల్ని విజయవంతంగా గుర్తించారు. వినియోగదారులు తమ పేరుపై ఎన్ని సిమ్‌కార్డులు జారీ అయ్యాయో తెలుసుకునేందుకు, పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్లను బ్లాక్‌ చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను ఉద్దేశించిన విషయం తెలిసిందే. ఐటీ శాఖకూ మంత్రిగా ఉన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవే దీనిని ఈ మధ్యే ప్రారంభించారు. మృతుల ఫొటోల ఆధారంగా వారి ఫోన్‌ నంబర్లు, ఆధార్‌ వివరాలను ఈ పోర్టల్‌ బయటపెట్టింది. వీటి ఆధారంగానే కుటుంబ సభ్యుల్ని సంప్రదించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు అక్కడి సెల్‌ఫోన్‌ టవర్ల ద్వారా ఏయే కాల్స్‌ వెళ్లాయో తెలుసుకుని, ఆ తర్వాత ఆగిపోయిన ఫోన్లతో ఆ వివరాలను క్రోడీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు