రాజస్థాన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 26 మంది గాయపడిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో బాంద్రా టెర్మినస్-జోధ్‌పూర్ సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పాయి. రైలు ముంబై నుంచి జోధ్‌పుర్‌కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 26 మంది పైగా ప్రయాణికులు గాయపడ్డారని.. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని భారతీయ రైల్వే ప్రకటించింది. గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా సైతం ప్రకటించింది.
సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయాలైన వారికి రూ. 25,000 ల పరిహారం అందించనున్నట్లు రైల్వే, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీంతోపాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హుటాహుటిన రాజస్థాన్ వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాత్రి జోధ్‌పూర్ డివిజన్ రాజ్‌కియవాస్-బొమద్రా సెక్షన్ పరిధిలోని పాలీ ప్రాంతానికి చేరుకున్న అశ్విని వైష్ణవ్ ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 8 స్లీపర్ క్లాస్ బోగిలు పట్టాలు తప్పాయని అధికారులు మంత్రికి వివరించారు.
Inspected the site. pic.twitter.com/ChU1dHbVFi
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 2, 2023
ఈ సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్.. రైల్వే పట్టాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విరిగిపోయిన ట్రాక్ ముక్కలను పరిశీలించారు. ఎవరైనా కావాలని పట్టాలను కోసారా..? లేకా మరేదైనా కుట్రకోణం ఉందా..? అనే విషయాల గురించి ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియోను అశ్విని వైష్ణవ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. టెక్నికల్ అండ్ ఫోరెన్సిక్ ద్వారా దర్యాప్తు నిర్వహించి, ఘటనకు గల కారణాన్ని కనుగొంటామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సాంకేతిక మార్పులు చేస్తామని ఆయన వివరించారు.
Raj | Railways min Ashwini Vaishnaw today visited Bandra-Jodhpur Suryanagari Express train accident site in Pali
Technical&forensic probe will be conducted to find the root cause of the incident & make technical changes so that such an incident does not repeat, he said. pic.twitter.com/spzk6nirza
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 2, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..