
Indian Railways: డిసెంబర్ 1వ తేదీ రావడంతో ప్రభుత్వ, బ్యాంకింగ్, ఆర్ధిక పరంగా కొన్ని మార్పులు అమల్లోకి వచ్చాయి. అందులో భాగంగా రైల్వే తత్కాల్ బుకింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలను నేటి నుంచి ప్రవేశపెట్టనున్నారు. ఎక్కడికైనా అర్జెంట్‌గా వెళ్లాలనుకుంటే వెంటనే తత్కాల్ టికెట్ బుక్ చేసుకుంటారు. ఎక్కడికైనా వెంటనే ప్రయాణం చేయాలంటే తత్కాల్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. సాధారణ టికెట్లతో పోలిస్తే కాస్త ధర ఎక్కువగా ఉన్నా.. వెంటనే వెళ్లాలి కాబట్టి తత్కాల్ టికెట్ బుక్ చేసుకుంటారు. అయితే ఈ టికెట్లపై కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.
ఇక నుంచి తత్కాల్ సిస్టమ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవడం తప్పనిసరి చేస్తున్నారు. ఓటీపీ వెరిఫై అయిన తర్వాతే టికెట్లు బుక్ అవుతాయి. ఒకవేళ ఓటీపీ తప్పుగా ఎంటర్ చేస్తే టికెట్ కన్ఫరేషన్ అవ్వదు. సురక్షితంగా టికెట్లు బుక్ చేసుకునేందుకు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రైల్వే ఈ వ్యవస్థ తీసుకొచ్చింది. కేవలం తత్కాల్ బుకింగ్‌లకు మాత్రమే ఆ నిర్ణయం వర్తిస్తుంది. మిగతా టికెట్లు యథావిధిగా ఐఆర్‌సీటీసీ లాగిన్స్‌తో ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ బుకింగ్స్‌కు ఓటీపీ వెరిఫికేషన్ వ్యవస్థ తీసుకురావడానికి అనేక కారణాలు ఉన్నాయి.
కొంతమంది తత్కాల్ బుకింగ్‌లో మోససూరిత పద్దతులు పాటిస్తున్నారు. దీని వల్ల అసలు ప్రయాణికులకు నష్టం చేకూరుతుంది.దీనికి చెక్ పెట్టేందుకు రైల్వేశాఖ ఓటీపీ వెరిఫికేషన్ సిస్టమ్ కొత్తగా తీసుకొస్తుంది. వెరిఫైడ్ ప్రయాణికులు మాత్రమే ఇక నుంచి టికెట్లు బుక్ చేసుకుంటారని, దీని వల్ల పారదర్శకత ఉంటుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.