స్టేషన్‌లో అనుమానంగా తిరుగుతూ కనిపించిన వ్యక్తి.. ఆపి బ్యాగ్‌ చెక్‌ చేయగా..

ట్రైన్‌లలో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఒక కేటుగాడిని రైల్వే పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీసు సిబ్బందితో కలిసి రాయిచూర్‌ రైల్వే స్టేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతిని వద్ద నుంచి రూ. 2,76,000 విలువైన బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

స్టేషన్‌లో అనుమానంగా తిరుగుతూ కనిపించిన వ్యక్తి.. ఆపి బ్యాగ్‌ చెక్‌ చేయగా..
Train Robbery

Updated on: Aug 29, 2025 | 4:48 PM

ట్రైన్‌లలో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఒక కేటుగాడిని రైల్వే పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రాయచూర్ రైల్వే స్టేషన్‌లో గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి బంగారం, ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు, రూ. 2,76,000 విలువైన 3 మొబైల్ ఫోన్‌లతో సహా దొంగిలించబడిన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 09093 నెంబర్‌ గల బాంద్రా టెర్మినస్ – వేలంకన్ని ఎక్స్‌ప్రెస్‌లో దొంగతనం జరిగిందన్న సమచారంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. దీంతో గుంతకల్లు డివిజన్‌ పరిధిలోని రాయచూర్ రైల్వే స్టేషన్‌లోనున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్/డిటెక్షన్ ఇన్వెస్టిగేషన్ వింగ్ సహాయంతో రాయిచూర్‌ రైల్వే స్టేషన్‌ నిందితుడి కోసం నిఘాలో ఉన్నారు.

అయితే ట్రైన్‌ రైల్వే స్టేషన్‌లోకి రాగానే పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. అయితే ట్రైన్‌లోంచి దిగిన ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగ్‌ను తనిఖీ చేయగా, అందులో దొంగిలించబడిన వస్తువులు రూ.40,000 విలువైన 04 గ్రాముల బంగారు మంగళసూత్రం; రూ.1,30,000 విలువగల డెల్ ల్యాప్‌టాప్; రూ.47,000 విలువైన మూడు మొబైల్ ఫోన్లు, రూ.59,000 ఖరీదైన ఆపిల్ ట్యాబ్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని పీఎస్‌కు తరలించారు.

అయితే తన బ్యాగ్‌లోని వస్తువుల గురించి అడినప్పుడు అతను వాటిని పలు రైళ్లలో దొంగలించినట్టు అంగీకరించాడు. దీంతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.