వంద రోజులకు చేరుకున్న రైతుల ఆందోళనలు.. కేంద్రం మొండిగా వ్యవహరిస్తుందని మండిపడ్డ రాహుల్‌గాంధీ

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే..ఈ రైతుల ఆందోళన నేటికి 100 రోజులకు చేరుకుంది.

వంద రోజులకు చేరుకున్న రైతుల ఆందోళనలు.. కేంద్రం మొండిగా వ్యవహరిస్తుందని మండిపడ్డ రాహుల్‌గాంధీ
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 06, 2021 | 3:39 PM

Rahul slams centre : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే..ఈ రైతుల ఆందోళన నేటికి 100 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భరతమాత ముద్దు బిడ్డలుగా రైతుల కుమారులు దేశ రాజధాని సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారని, ప్రభుత్వం మాత్రం ఇక్కడ రైతులను అడ్డుకోడానికి బారికేడ్లను ఏర్పాటు చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. అన్నదాతలు తమ సరైన డిమాండ్ల కోసం పోరాడుతున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశంలోని రైతులపట్ల కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందన్న ఆయన, సాగు చట్టాల సవరణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోందని ట్విట్టర్ వేదికగా రాహుల్ మండిపడ్డారు.

మరోవైపు, కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను నిరసిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన శనివారంతో వంద రోజులు అయ్యింది. ఈ సందర్భంగా కుండ్లీ-మనసేర్- పల్‌వాల్ హైవేను వారు దిగ్బంధించారు. ఈ దిగ్బంధం ఉదయం 11 నుంచి 3 గంటల వరకూ కొనసాగించారు రైతులు. అయితే, దీన్ని తాము ప్రశాంతంగా నిర్వహిస్తామని అయినా పోలీసులు అడుగడునా అడ్డుకున్నారని రైతు సంఘాల నేతలు తెలిపారు. అయితే ఎమర్జెన్సీ వాహనాలను మాత్రం అనుమతిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జగ్మోహన్ సింగ్ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజస్థాన్ సరిహద్దుల్లో “కుండ్లి-మనేసర్-పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే” దిగ్బంధం చేశారు రైతులు. ఈ రోజు ప్రజలు ఇంటివద్ద నలజెండాలు ఎగురవేయాలని పిలుపు నిచ్చాయి రైతు సంఘాలు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీక్షా స్థలాల్లో మహిళలతో ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నాయి రైతు సంఘాలు. అలాగే ఈనెల 10న ట్రేడ్ యూనియన్లతో సమావేశం నిర్వహించనున్నారు. మార్చి 15న కార్మికులు, ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేయనున్నారు రైతులు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు రైతు బృందాలను పంపి భాజపా అభ్యర్థులను ఓడించేందుకు కృషి చేయాలని రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.

Read Also… బీజేపీలో చేరిన మరో తృణమూల్ కాంగ్రెస్ నేత, సువర్ణ అధ్యాయమని వ్యాఖ్య