ఫ్రెండ్‌షిప్ డే.. కొరియన్ ఫింగర్ హార్ట్‌తో రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ పోస్ట్

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన కొరియన్ ఫింగర్ హార్ట్ జెశ్చర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను ఇంకా విద్యార్థినేనని, ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని చెబుతూ జెన్ జెడ్ యువతకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఫ్రెండ్‌షిప్ డే.. కొరియన్ ఫింగర్ హార్ట్‌తో రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
Rahul Gandhi

Updated on: Aug 02, 2026 | 9:30 PM

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్‌గా మారింది. కొరియన్ పాప్ సంస్కృతిలో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన కొరియన్ ఫింగర్ హార్ట్ చూపిస్తూ ఫొటోను పంచుకున్న ఆయన, జెన్ జీ యువతకు ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఆయన పోస్ట్‌లో.. “నేను ఇంకా విద్యార్థినే. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాను. నేటి పాఠం.. ఇది స్నేహితుల దినోత్సవం, ఇది ఒక హార్ట్” అని పేర్కొన్నారు. అనంతరం “అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.. ఎంతో ప్రేమతో” అంటూ తన సందేశాన్ని ముగించారు.

కొరియన్ హార్ట్ అంటే ఏంటి..?

కొరియన్ ఫింగర్ హార్ట్ అనేది బొటనవేలు, చూపుడు వేలును కలిపి చిన్న గుండె ఆకారాన్ని సూచించే సంజ్ఞ. దక్షిణ కొరియా పాప్ సంస్కృతి (కె-పాప్) ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ జెశ్చర్ ప్రేమ, ఆప్యాయత, అభిమానం, స్నేహానికి ప్రతీకగా భావిస్తారు. ప్రముఖ సినీ, సంగీత కళాకారులు, క్రీడాకారులు అభిమానులను పలకరించే సమయంలో ఈ సంజ్ఞను తరచుగా ఉపయోగిస్తుంటారు. స్నేహ దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ ఈ సంజ్ఞతో శుభాకాంక్షలు తెలియజేయడం ఆసక్తికరంగా మారింది.

రాహుల్ గాంధీ పోస్ట్ ఇక్కడ చూడండి

Loading...
Unable to load recommendations.
Follow Us