దేశంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ..ప్రధాని మోదీ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. ఈ ప్రభుత్వం పన్నుల బలవంతపు వసూళ్లకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. మీ కారు పెట్రోలు లేదా డీజిల్ తో నడుస్తుండవచ్చు..కానీ మీ ప్రభుత్వం మాత్రం బలవంతంగా పన్నుల వసూళ్లకు పాల్పడుతోంది అని ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ. 100.21, డీజిల్ లీటర్ రూ. 89.53 ఉండగా ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా వంటి నగరాల్లో కూడా పెట్రోలు లీటర్ ధర 100 రూపాయల పై గానే ఉంది. ముంబైలో పెట్రోలు లీటర్ రూ. 106.25 ఉండగా డీజిల్ 97.09, చెన్నైలో పెట్రోలు లీటర్ రూ. 101.6, డీజిల్ రూ. 94.06, కోల్ కతాలో పెట్రోలు లీటర్ రూ. 100.23, డీజిల్ రూ. 92.50 ఉంది.
గ్లోబల్ క్రూడాయిల్ ధరలను బట్టి భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు దేశీయంగా ఈ రేట్లను నిర్ణయిస్తున్నాయి. వీటి ధరలు ఎలా ఉన్నా ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు మారుతూ ఉంటాయి. కాగా సప్లయ్ పెంచే విషయంలో ఒపెక్ దేశాల మధ్య కుదరడానికి ఉద్దేశించి బుధవారం జరగాల్సిన సమావేశం రద్దయింది. ఈ ఒప్పందం కుదిరితే సప్లయ్ పెరిగి ధరలు కొంత తగ్గే సూచనలు ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Area 51 News: అమెరికా ఆర్మీ క్యాంప్‌పై ఏలియన్స్ చక్కర్లు..?.. ప్రచారంలో నిజమెంత..?
పర్యాటకులను ఆకర్షిస్తున్న సిక్కిం.. అందమైన ప్రాంతాలను పుట్టిల్లు ఇదే..