Rahul Gandhi: బీజేపీకి బీజేడీ బీ టీమ్‌.. రాహుల్ విమర్శలు

ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాహుల్‌గాంధీ. భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఓడించినట్టే ఒడిశాలో బీజేడీని ఓడిస్తామన్నారు.

Rahul Gandhi: బీజేపీకి బీజేడీ బీ టీమ్‌.. రాహుల్ విమర్శలు
Rahul Gandhi

Updated on: Feb 07, 2024 | 9:50 PM

ఒడిశాకు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌యాత్ర చేరుకుంది. జార్ఖండ్‌లో యాత్రను ముగించిన రాహుల్‌ ఒడిశాకు చేరుకున్నారు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌పై , బీజేడీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి బీజేడీ బీటీమ్‌గా మారిందన్నారు. పార్లమెంట్‌లో అన్ని బిల్లులకు నవీన్‌ పట్నాయక్‌ మద్దతు ఇచ్చారని అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఓడించినట్టే ఒడిశాలో బీజేడీని కాంగ్రెస్‌ ఓడిస్తుందన్నారు రాహుల్‌గాంధీ.

“తెలంగాణలో కూడా అప్పటి సీఎం బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఢిల్లీతో రహస్య ఒప్పందం ఉండేది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను ఓడించాం. అదే పని ఇక్కడ బీజేడీతో చేయబోతున్నాం.. భారత్‌ జోడో యాత్ర లక్ష్యం ప్రేమను పంచడమే.. ” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పశ్చిమ ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలోని వేదవ్యాస్ ధామ్‌ను దర్శించారు రాహుల్ గాంధీ. ఒక రాతి గుహాలో ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడే కూర్చొని వేదవ్యాసుడు మహాభారతం రచించాడని అంటారు. రెండు రోజుల ఒడిషా యాత్రలో దాదాపు 200 కిలోమీటర్లు రాహుల్‌ ప్రయాణిస్తారు.

గురువారం ఝార్స్‌గూడా మీదుగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోకి భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రవేశిస్తుంది. రాహుల్‌ జోడో యాత్ర కోసం కాంగ్రెస్‌ శ్రేణులు భారీ ఏర్పాట్లను చేశాయి ఆ రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..