పార్లమెంట్‌ నుంచి విజయ్‌చౌక్‌ వరకు విపక్షాల ర్యాలీ.. కేంద్రంపై రాహుల్‌ తీవ్ర విమర్శలు

|

Dec 14, 2021 | 3:53 PM

Rahul Gandhi: రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాల నిరసన కొనసాగుతోంది. ఇటు పార్లమెంటు లోపల.. అటు పార్లమెంటు వెలుపల ఆందోళన చేపడుతున్నారు. 

పార్లమెంట్‌ నుంచి విజయ్‌చౌక్‌  వరకు విపక్షాల ర్యాలీ.. కేంద్రంపై రాహుల్‌ తీవ్ర విమర్శలు
Congress leader Rahul Gandhi joins Opposition's protest
Follow us on

రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాల నిరసన కొనసాగుతోంది. ఇటు పార్లమెంటు లోపల.. అటు పార్లమెంటు వెలుపల ఆందోళన చేపడుతున్నారు.  విజయ్‌చౌక్‌ నుంచి పార్లమెంట్‌ భవన్‌ వరకు ప్రతిపక్ష ఎంపీలు ర్యాలీ తీశారు. రాజ్యాంగ విరుద్దంగా ఎంపీలను సస్పెండ్‌ చేశారని , వెంటనే సస్పెన్షన్‌ ఎత్తివేయాలని విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను కేంద్ర మంత్రి హత్య చేసిన విషయం ప్రధాని మోదీకి తెలుసని ఆరోపించారు. పార్లమెంట్‌ సమావేశాలకు రాకుండా ప్రధాని మోడీ.. వారణాసి పర్యటనకు వెళ్లడం సరికాదన్నారు.

ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే కేంద్రం పనిచేస్తోందని విమర్శించారు.. 12 మంది ఎంపీల సస్పెన్షన్‌కు కారణం రాజ్యసభ ఛైర్మన్‌ , ప్రధాని మోదీ కాదని , ఆ ముగ్గురు పారిశ్రామికవేత్తలే అని  విమర్శించారు. కీలకమైన బిల్లులను ప్రభుత్వం ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్‌.

ప్రధాని మోడీకి పార్లమెంటుపై గౌరవం లేదు.. చిదంబరం విమర్శలు

ప్రధాని నరేంద్ర మోడీకి పార్లమెంటుపై ఏ మాత్రం గౌరవం లేదని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పీ.చిదంబరం విమర్శించారు. డిసెంబరు 13న పార్లమెంటు దాడి ఘటనలో మృతులకు ప్రధాని మోడీ నివాళులర్పించకుండా.. వారణాసి పర్యటనకు వెళ్లారన్నారు. ప్రధాని మోడీ వారణాసి, అయోధ్యలాంటి చోటే కనిపిస్తారని.. పార్లమెంటులో కనిపించరంటూ చిదంబరం ధ్వజమెత్తారు.

Also Read..

Maa Committee: మా కమిటీలోకి కొత్త సభ్యులు.. రాజీనామా చేసినవారు కూడా మా సభ్యులే.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్..

AP Government: పెన్షనర్లకు గుడ్ న్యూస్ అందించిన ఏపీ ప్రభుత్వం.. వచ్చే నెల నుంచి వృద్దాప్య పెన్షన్ పెంపు.!