Rahul Gandhi Defamation Case: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. పరువునష్టం కేసులో ఈ నెల 29న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 2019, ఏప్రిల్ 13న కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ‘మోదీ’ ఇంటి పేరుపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ దుమారం రేపాయి. దీంతో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ ఆయనపై పరువు నష్టం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు సూరత్ కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసు విషయంలో రాహుల్ గాంధీ గతంలో పలుసార్లు కోర్టుకు హాజరయ్యారు. రాహుల్ తరఫున న్యాయవాది కిరీట్ పన్వాలా మాట్లాడుతూ.. ఇద్దరు కొత్త సాక్షుల వాంగ్మూలాలపై.. తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు 29న హాజరుకావాలని కోర్టు రాహుల్‌ను ఆదేశించినట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉందని.. పన్వాలా వెల్లడించారు. నిన్న జరిగిన విచారణలో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఏఎన్ దవే సమన్లు జారీ చేసినట్లు వెల్లడించారు.
కాగా.. 2019లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని ఇంటి పేరు (మోదీ) పై రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేశారు. ‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. వాళ్లందరి ఇంటి పేరు మోదీనే చూశారా!.. దొంగలందరి ఇంటి పేరు సాధారణంగా ఒకటే ఎందుకు వచ్చింది.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మోడీ సమాజాన్ని పరువు తీసేలా ప్రవర్తించారిన ఎమ్మెల్యే రాహుల్‌పై ఫిర్యాదుచేశారు. రాహుల్ గాంధీపై సెక్షన్‌లు 499, 500 కింద పరువు నష్టం దావా వేశారు. కాగా.. పూర్ణేష్ మోడీ ఇప్పుడు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
Also Read: