ఆదివాసీ గెటప్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన రాహుల్..

ఛత్తీస్‌గఢ్‌లో జాతీయ ఆదివాసీ నృత్య వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ వేడుకలను ప్రారంభించారు.  రాయ్‌పూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆదివాసీ గెటప్‌లో.. డోల్ వాయిస్తూ.. అందర్నీ అలరించారు. స్టేజ్‌పై గిరిజనులతో కలిసి.. డాన్స్ చేశారు. #WATCH Chhattisgarh: Congress leader Rahul Gandhi takes part in a traditional dance at […]

ఆదివాసీ గెటప్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన రాహుల్..

Edited By:

Updated on: Dec 27, 2019 | 1:31 PM

ఛత్తీస్‌గఢ్‌లో జాతీయ ఆదివాసీ నృత్య వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ వేడుకలను ప్రారంభించారు.  రాయ్‌పూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆదివాసీ గెటప్‌లో.. డోల్ వాయిస్తూ.. అందర్నీ అలరించారు. స్టేజ్‌పై గిరిజనులతో కలిసి.. డాన్స్ చేశారు.

కాగా, ఈ ఆదివాసీ నృత్యోత్సవ వేడుకలకు 25 రాష్ట్రాల్లోని ఆదివాసీలతో పాటుగా.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 1200 మంది గిరిజన నృత్య కళాకారులు పాల్గొంటున్నారు. అంతేకాదు.. శ్రీలంక, ఉగాండా, బెలరస్, మాల్దీవులు, థాయిలాండ్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన ట్రైబల్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ గిరిజనులు గుస్సాడీ నృత్యాన్ని, ఏపీ గిరిజనులు థింసా నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. మొదటి స్థానంలో నిలిచిన బృందానికి రూ. 20 లక్షల బహుమతి, రెండో స్థానంలో నిలిచిన బృందానికి రూ. 12 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన బృందానికి రూ. 8 లక్షల బహుమతి ఇవ్వనున్నారు.