భారత వాయుసేనలోకి చేరిన రఫేల్ విమానాలు

|

Sep 10, 2020 | 11:54 AM

భారత అమ్ములపొదిలోకి మరో వజ్రాయుధం వచ్చి చేరింది. వాయుసేనలోకి అధికారికంగా రఫేల్ విమానాలను ప్రవేశ పెట్టింది కేంద్ర రక్షణ శాఖ.

భారత వాయుసేనలోకి చేరిన రఫేల్ విమానాలు
Follow us on

భారత అమ్ములపొదిలోకి మరో వజ్రాయుధం వచ్చి చేరింది. వాయుసేనలోకి అధికారికంగా రఫేల్ విమానాలను ప్రవేశ పెట్టింది కేంద్ర రక్షణ శాఖ. ఫ్రాన్స్ నుంచి కొనుగోలుచేసిన అత్యాధునిక రఫేల్ యుద్ధవిమానాలు వైమానిక దళంలోకి అధికారికంగా చేరిపోయాయి. రఫెల్ యుద్ధ విమానాల రాకతో భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో లాంఛనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా స‌ర్వ‌ధ‌ర్మ పూజ నిర్వ‌హించారు. స‌ర్వ మ‌తాల‌కు చెందిన పెద్ద‌లు పూజ‌లు చేశారు. భారత్, ఫ్రాన్స్ రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ఫ్లొరెన్స్‌ పార్లీ తోపాటు ఇరు దేశాలకు చెందిన రక్షణ విభాగం ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

భారత వాయుసేనలో 17వ స్క్యాడ్రన్‌గా రఫేల్ విమానాలు చేరాయి. ఇవి 17వ స్క్యాడ్రన్ గోల్డెన్ ఆరోస్‌ ద్వారా సేవలను అందజేయనున్నాయి. భార‌త వాయుసేన‌లో కొత్త అధ్యాయం మొద‌లైంది. 36 రాఫెల్స్ కోసం 59వేల కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా తొలి దశలో జులై 29న ఫ్రాన్స్ నుంచి ఐదు రఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. వ‌చ్చే నెల‌లో మ‌రో నాలుగు రాఫెల్ విమానాలు ఇండియాకు రానున్నాయి. కాగా, అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో ఇవాళ అయిదు రాఫేల్ యుద్ధ విమానాల ఇండ‌క్ష‌న్ సెర్మ‌నీ జ‌రిగింది.


స‌ర్వ‌ధ‌ర్మ పూజ అనంతరం నిర్వహించిన ఎయిర్‌షో అందరినీ ఆకట్టుకుంది. తొలుత రాఫేల్ విమానం చుట్టూ సుఖోయ్‌ 30, జాగ్వార్ విమానాలు గాలిలో ఎగురుతూ వంద‌నం చేశాయి. తేజ‌స్ యుద్ధ విమానాలు కూడా రాఫేల్‌కు స్వాగ‌తం ప‌లికాయి. గోల్డెన్ యారోస్ స్క్వాడ్ర‌న్‌లో చేరిన రాఫేల్స్‌కు వాట‌ర్ కెనాన్‌ సెల్యూట్ కూడా నిర్వ‌హించారు..