తమిళనాడు ఎన్నికల బరిలో రాధిక.. ఏ పార్టీ నుంచి.. ఏ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారో తెలుసా?

|

Feb 03, 2021 | 4:32 PM

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో..

తమిళనాడు ఎన్నికల బరిలో రాధిక.. ఏ పార్టీ నుంచి.. ఏ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారో తెలుసా?
Follow us on

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకప్పటి తెలుగు అగ్ర హీరోయిన్‌ రాధికా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారను. ఈ విషయాన్ని స్వయంగా రాధిక భర్త శరత్‌కుమార్ ప్రకటించారు.

సమత్తువ మక్కల్ కట్చి(SMK) అనే పార్టీని శరత్‌కుమార్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి మహిళా విభాగం ఇన్‌చార్జ్‌గా రాధిక వ్యవహరిస్తున్నారు. 2011 నుంచి ఎస్‌ఎంకే పార్టీ అన్నాడీఎంకేతో కలిసి నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేతో కలిసే పోటీకి దిగుతున్నట్లు శరత్‌కుమార్ ప్రకటించారు. అయితే.. ఈసారి పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు ఆశిస్తున్నామని, ప్రత్యేక చిహ్నంపై పోటీ చేస్తామని శరత్‌కుమార్ తెలిపారు.

2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా శరత్‌కుమార్ పార్టీ పోటీ చేసింది. ఆ సమయంలో.. తెంకాసి నియోజకవర్గం నుంచి శరత్‌కుమార్, నంగునేరి స్థానం నుంచి ఎ.నారాయణన్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో తన భార్య రాధికను పోటీకి నిలపాలని శరత్‌కుమార్ భావిస్తున్నట్లు ఆయన తాజా వ్యాఖ్యలతో స్పష్టమవుతుంది.

సినీ నటుడు కమల్‌‌హాసన్ కూడా ఇప్పటికే పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారు. సినీ నటుడు రజనీకాంత్ మినహాయిస్తే తమిళనాడులో చాలామంది సినీ నటులు ఈసారి ఎన్నికల ప్రచారంలో భాగం కానున్నారని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సినీ గ్లామర్‌ను సంతరించుకోనున్నాయి.

 

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం.. తాజాగా సంచలనం రేపుతున్న ఓ ఎమ్మెల్యే ఆడియో రికార్డు