
పంజాబ్ లోని అమృత్‌సర్‌లో బాంబు పేలుడులో చనిపోయిన వ్యక్తిని బబ్బర్ ఖల్సా ఉగ్రవాదిగా గుర్తించారు. మంగళవారం(మే 27) ఉదయం జరిగిన పేలుడులో ఉగ్రవాది చనిపోయినట్టు పంజాబ్ పోలీసులు నిర్ధారించారు. బాంబు తయారు చేస్తుండగా అది పేలడంతో టెర్రరిస్ట్ చనిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొంతకాలంగా పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉగ్రవాదుల కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని మజితా రోడ్ బైపాస్‌లో ఉన్న డీసెంట్ అవెన్యూ వెలుపల భారీ బాంబు పేలుడు సంభవించింది. ఇందులో ఒక ఉగ్రవాది మరణించాడు. ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ సంఘటనలో గాయపడిన అనుమానిత ఉగ్రవాదిని గురు నానక్ దేవ్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ వ్యక్తి ఒక బబ్బర్ ఖల్సా ఉగ్రవాదిగా పోలీసులు తేల్చారు. బాంబు పేలుళ్ల కోసం పంపిన పేలుడు పదార్థాలను డెలివరీ చేయడానికి వచ్చాడని, కానీ ఈ సమయంలో పేలుడు పదార్థాలు పేలి ఆ వ్యక్తి మరణించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
అదే సమయంలో, గాయపడిన వ్యక్తి చేతిలో బాంబు లాంటి వస్తువు ఉందని, అది అకస్మాత్తుగా పేలిపోయిందని సంఘటన స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ పేలుడు చాలా శక్తివంతంగా ఉండటం వల్ల ఆ వ్యక్తి చేతులు, కాళ్ళు రెండూ ముక్కలైపోయాయి. ఆ వ్యక్తి అక్కడికి ఎందుకు వచ్చాడో, ఏం చేస్తున్నాడో తమకు తెలియదని స్థానికులు అంటున్నారు? అంతకుముందు, పోలీసు అధికారి మాట్లాడుతూ, పేలుడు గురించి మాకు సమాచారం అందిందని, వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నామని, అక్కడ ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని చెప్పారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించామన్నారు. FSL బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అమృత్‌సర్ గ్రామీణ SSP మణీందర్ సింగ్ అన్నారు.
#WATCH | Amritsar, Punjab | An explosion occurred in the area around Naushera village under the Kambo police station limits in the Amritsar rural district.
SSP Amritsar Rural, Maninder Singh, says, "We received information in the morning that there was an explosion here. The… pic.twitter.com/zzKRU7nu9e
— ANI (@ANI) May 27, 2025
పోలీసులు ఈ మొత్తం విషయాన్ని తీవ్రంగా దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. విస్తృత దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..