Patiala Violence: పాటియాలాలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. హింసాకాండ సూత్రధారి అరెస్ట్!

పాటియాలా హింసాత్మక సూత్రధారి బర్జిందర్ సింగ్ పర్వానాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అతడిని ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు.

Patiala Violence: పాటియాలాలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. హింసాకాండ సూత్రధారి అరెస్ట్!
Patiala Violence

Updated on: May 01, 2022 | 10:27 AM

Mastermind Arrested in Patiala Violence: పంజాబ్‌ పాటియాలాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. సాయంత్రం వరకూ పరిస్థితులు చక్కబడటంతో కర్ఫ్యూ ఎత్తివేశారు. ముగ్గురు పోలీస్‌ అధికారులపై బదిలీ వేటు వేశారు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌. ఈ హింసాత్మక సూత్రధారి బర్జిందర్ సింగ్ పర్వానాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అతడిని ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. శుక్రవారం నాటి ఘటనకు ప్రధాన నిందితుడిగా, ప్రధాన సూత్రధారి బర్జిందర్ సింగ్ పర్వానాను గుర్తించినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

పంజాబ్ పోలీసులు శనివారం ఖలిస్థాన్ వ్యతిరేక మార్చ్‌పై ఘర్షణలకు పాల్పడ్డారని ఆరోపించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ సంఘటన వెనుక నేర నేపథ్యం ఉన్న రాజ్‌పురా నివాసిని గుర్తించారు. మరో ఇద్దరు నిందితులను దల్జీత్ సింగ్, కుల్దీప్ సింగ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఘర్షణ జరిగిన కొన్ని గంటల తర్వాత, అనుమతి లేకుండా ఊరేగింపు నిర్వహించి హింసను ప్రేరేపించినందుకు హరీష్ సింగ్లాను పోలీసులు అరెస్టు చేశారు.

పంజాబ్‌ పాటియాల అల్లర్లు రాజకీయపరమైనవన్నారు సీఎం భగవత్‌ మాన్. వాటిని మతపరమైన అల్లర్లుగా చిత్రీకరించడం తగదన్నారు. శివసేన, కాంగ్రెస్‌ మధ్య పరస్పర ఘర్షణతోనే హింస చెలరేగిందన్నారు. ప్రస్తుతం పాటియాలలో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. శాంతికోసం వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.పంజాబ్‌ పాటియాలలో చెలరేగిన ఘర్షణలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు ఎస్పీ దీపక్‌ పరీక్‌. అల్లర్లపై వీడియో ఫుటేజీల ఆధారంగా మరింత మందిని గుర్తించాల్సి ఉందన్నారు. అల్లర్లకు కారణమైన ఎవ్వరిని వదలబోమని స్పష్టం చేశారు.

Read Also…  Nitish Kumar: ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ తొలగింపు వివాదంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!