Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇటీవల కూనూర్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రక్షణ సిబ్బందికి నివాళులు అర్పించింది. వారి కుటుంబాలకు తన సానుభూతి ప్రకటించి.. పీఎన్బీ పారా కమాండో లాన్స్ నాయక్ వివేక్ కుమార్, పారా కమాండో లాన్స్ నాయక్ బి సాయి తేజ కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయల చొప్పున బీమా క్లెయిమ్‌ను బ్యాంక్ ముందస్తుగా సెటిల్ చేసింది.
పారా కమాండో లాన్స్ నాయక్ వివేక్ కుమార్ డిసెంబర్ 2012లో సైన్యంలో చేరారు. ఈయన హిమాచల్ ప్రదేశ్‌లోని జైసింగ్‌పూర్ అనే చిన్న పట్టణానికి చెందినవారు. ఈయన 1 PARA SFలో ప్రత్యేక దళంలో భాగంగా ఉన్నారు. అలాగే, జమ్మూ-కాశ్మీర్, దక్షిణ- ఉత్తర కాశ్మీర్‌లో పనిచేశారు. అదేవిధంగా పారా కమాండో లాన్స్ నాయక్ బి సాయి తేజ జూన్ 2013లో ఆర్మీ సర్వీస్ కార్ప్స్ సైనికుడిగా సైన్యంలో చేరారు. తరువాత మే 2019లో మెరూన్ బెరెట్, బాలిడాన్ బ్యాడ్జ్‌ను పొందారు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన మొత్తం 11 మంది గొప్ప యోధుల మృతికి పీఎన్బీ(PNB) సీనియర్ మేనేజ్‌మెంట్, బ్యాంక్ ఉద్యోగులు సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీఎన్బీ సిజీఎం సునీల్ సోని , సిమ్లా జోనల్ మేనేజర్ ప్రమోద్ కుమార్ దూబే, ఏడీసీ కాంగ్రా ఎస్ రాహుల్, కోస్రీ గ్రామంలో లాన్స్ నాయక్ వివేక్ కుమార్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా పరామర్శించారు. యాజమాన్యం క్లెయిమ్ సెటిల్‌మెంట్ చెక్కును ఆయన భార్య ప్రియాంక రాణికి అందచేశారు.
అదేవిధంగా హైదరాబాద్ పీఎన్బీ జోనల్ మేనేజర్ సంజీవన్ నిఖార్, విజయవాడలో పిఎన్‌బి సర్కిల్ హెడ్ ఎయుబి రెడ్డి, చిత్తూరులో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి విజయ్ శంకర్ రెడ్డి లాన్స్ నాయక్ సాయి తేజ కుటుంబానికి క్లెయిమ్ సెటిల్‌మెంట్ చెక్కును అందజేశారు. డ్డాయి.
పదకొండు మంది అమరవీరుల్లో ఇద్దరు ‘PNB రక్షక్ జీతం’ పథకం కింద బీమా కవర్ లో ఉన్నారు. వారి క్లెయిమ్‌లు వెంటనే PNB అధికారులు వ్యక్తిగతంగా నామినీలకు చెక్కులను అందజేయడం ద్వారా ఆలస్యం చేయకుండా పరిష్కరించారు. ‘PNB రక్షక్ జీతం’ ఖాతాలో రక్షణ సిబ్బంది, పోలీసులు, పారామిలటరీ సిబ్బందికి వ్యక్తిగత ప్రమాద కవరేజీ రూ.60 లక్షలు, విమాన ప్రమాద కవర్ రూ. 1 కోటి, ప్రయోజనాల మరొక పూర్తి ప్యాకేజీ. రక్షణ సిబ్బంది, పోలీసు, పారామిలటరీ సిబ్బంది పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ PNB అనేక CSR కార్యక్రమాలపై పని చేస్తోంది. వీర అమరవీరులు, అనుభవజ్ఞులు, వారి కుటుంబాలపై ఆధారపడిన వారికి సహాయం చేయడానికి బ్యాంక్ గతంలో అనేక విరాళాలు అందించింది.
ఇవి కూడా చదవండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. వాయిదా పడనున్న మెగావేలం.. ఎందుకంటే?
Stock Market: ఒమిక్రాన్ భయాలతో స్టాక్ మార్కెట్ కుదేలు.. రూ.6,81,0000 కోట్ల మదుపర్ల సందప ఆవిరి
Jaya Bachchan: కోడలికి ఈడీ సమన్లు.. రాజ్యసభలో బీజేపీకి జయాబచ్చన్ శాపనార్థాలు