పంజాబ్..తాను మరణిస్తూ.. మరో 23 మందికి కరోనా అంటించిన మతగురువు

| Edited By: Anil kumar poka

Mar 27, 2020 | 1:41 PM

కరోనా వైరస్ సోకిన వ్యక్తులు సెల్ఫ్ ఐసొలేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. తమకు కరోనా మహమ్మారి ఉందన్న విషయాన్ని దాచిపెడుతూ.. తమ సన్నిహితులకు, తమ కుటుంబాలవారికి కూడా ఈ వైరస్ సోకింపజేస్తున్నారు.

పంజాబ్..తాను మరణిస్తూ.. మరో 23 మందికి కరోనా అంటించిన మతగురువు
Follow us on

కరోనా వైరస్ సోకిన వ్యక్తులు సెల్ఫ్ ఐసొలేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ.. తమకు కరోనా మహమ్మారి ఉందన్న విషయాన్ని దాచిపెడుతూ.. తమ సన్నిహితులకు, తమ కుటుంబాలవారికి కూడా ఈ వైరస్ సోకింపజేస్తున్నారు. దీంతో ఆరోగ్యవంతులైనవారు కూడా ఈ వ్యాధిబారిన పడుతున్నారు. ఇందుకు పంజాబ్ లో ఓ గురుద్వారా మతగురువు ఉదంతమే నిదర్శనం. 70 ఏళ్ళ ఈయన.. గతంలో తన ఇద్దరు స్నేహితులతో కలిసి.. కరోనాతో అట్టుడుకుతున్న ఇటలీ, జర్మనీ దేశాల్లో రెండువారాలపాటు పర్యటించి ఇండియాలో అడుగుపెట్టాడు. తను సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండకుండా.. మరో 23 మందికి కరోనా లక్షణాలను అంటించాడు. ఇంతేకాదు.. సుమారు 100 మందిని కలిశాడని, 15 గ్రామాలను విజిట్ చేశాడని తెలిసింది. ఈ నెల 18 న ఈ మతగురువు ఆసుపత్రిలో మృతి చెందాడు.

మార్చి 8..10 తేదీల మధ్య ఆనందపూర్ సాహిబ్ లో జరిగిన వివిధ కార్యక్రమాల సందర్భంగా అనేకమందిని ఈయన కలిశాడని, అక్కడినుంచి షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలోని తన స్వగ్రామానికి, అనంతరం 15 గ్రామాల్లో తిరిగాడని తెలిసింది. ఇతని నిర్వాకం ఫలితంగా ఇతని కుటుంబంలో 14 మందికి కూడా కరోనా సోకిందట. ఈ మతగురువు కరోనా పాజిటివ్ లక్షణాలతోనే ఇంకా ఎవరెవరిని కలిశాడో తెలుసుకునేందుకు పోలీసులు ఆయా గ్రామాలను  సందర్శిస్తున్నారు. మొత్తానికి 15 గ్రామాలను సీల్ చేసేశారు. 23 మందిని ఐసోలేషన్ కు తరలించగా.. ఈయనతో కాంటాక్ట్ లో ఉన్న వందమంది ఎవరని కూడా ఆరా తీసేపనిలో పడ్డారు వాళ్ళు.

ఇటీవలే లక్నోలో బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కూడా తనకు కరోనా పాజిటివ్ ఉన్న లక్షణాలను దాచిపెట్టి పెద్ద డిన్నర్ ఇవ్వగా.. ఆ కార్యక్రమానికి అనేకమంది పొలిటిషియన్లు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు హాజరైన సంగతి  తెలిసిందే. అయితే వారందరికీ టెస్టుల్లో నెగటివ్ అని రాగా అంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే కనికా కపూర్ కి మూడో సారీ పాజిటివ్ అని రావడంతో ఆసుపత్రిలో ఐసోలేషన్ ఉంది.