‘ఛలో ఢిల్లీ’ రైతు ఉద్యమంలో విషాదం… కారులోనే సజీవ దహనమైన రైతు..

|

Nov 29, 2020 | 5:15 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో విషాధం చోటు చేసుకుంది.

‘ఛలో ఢిల్లీ’ రైతు ఉద్యమంలో విషాదం... కారులోనే సజీవ దహనమైన రైతు..
Follow us on

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. పంజాబ్‌కు చెందిన జనక్ రాజ్(55) అనే రైతు కారులో నిద్రపోగా.. ఆ కారుకు నిప్పు అంటుకుని అతను సజీవ దహనం అయ్యాడు. కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న జనక్ రాజ్ రోజంతా రాత్రి సమయంలో అక్కడే ఉన్న కారులో నిద్రపోయాడు. అయితే కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన చుట్టుపక్కన వాళ్లు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ వీలుపడలేదు. దీంతో అతను కారులోనే సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతుల్లో పెను విషాదం నింపింది. మరోవైపు అగ్నిప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనక్ రాజ్‌ స్వస్థలం పంజాబ్‌లోని బర్నాల జిల్లా ధనోలువా గ్రామం అని అధికారులు తెలిపారు.