Punjab: వైద్యాధికారితో మంత్రి దురుసు ప్రవర్తన.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఇన్సిడెంట్

|

Jul 30, 2022 | 8:34 PM

పంజాబ్ (Punjab) ఆరోగ్య మంత్రి చేతన్ సింగ్ జౌరమజ్రా చేసిన పని ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. మంత్రి చర్యతో ఆస్పత్రి ఛాన్సలర్ రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఫరిద్‌కోట్‌ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో...

Punjab: వైద్యాధికారితో మంత్రి దురుసు ప్రవర్తన.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఇన్సిడెంట్
Punjab Minister
Follow us on

పంజాబ్ (Punjab) ఆరోగ్య మంత్రి చేతన్ సింగ్ జౌరమజ్రా చేసిన పని ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచుతోంది. మంత్రి చర్యతో ఆస్పత్రి ఛాన్సలర్ రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఫరిద్‌కోట్‌ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని, శుభ్రతను సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోగ్య మంత్రి చేతన్ కు ఫిర్యాదులు వచ్చాయి. వారి కంప్లైంట్ తో ఆయన ఆస్పత్రిని సందర్శించారు. ఆ సమయంలో బాబా ఫరిద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్‌ సైన్సెన్‌ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్ రాజ్‌ బహదూర్ ఆయనతో పాటు ఉన్నారు. ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వైస్ ఛాన్సలర్ తో దురుసుగా ప్రవర్తించారు. ఆయనను ఆసుపత్రి బెడ్‌పై పడుకోమని హుకుం జారీ చేశారు. సమీపంలో ఉన్నవారు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో (Social Media) పోస్ట్ చేశారు. దీంతో సదరు వైద్యాధికారి తీవ్ర అవమానకరంగా భావించి.. తన పదవికి రాజీనామా చేశారు.

దీంతో ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) తీవ్రంగా ఖండించింది. వైస్‌ ఛాన్సలర్‌ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని, ఇది వైద్య వృత్తిని అగౌరవపర్చడమేనని మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా మంత్రి చేతను తీరును పలు రాజకీయ పార్టీలూ విమర్శించాయి. ఇలా చేయడం వల్ల వైద్య సిబ్బందిని నిరుత్సాహానికి గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ వెంటనే ఈ ఘటన పై స్పందించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..