LPG Gas Cylinder Price: రూ.300 తగ్గిన గ్యాస్​ సిలిండర్ ధర.. ప్రజలకు అక్కడి సర్కార్​ బంపర్ గిఫ్ట్..

|

Mar 13, 2023 | 4:44 PM

వంట గ్యాస్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. గ్యాస్​ వినియోగదారులకు పుదుచ్చేరి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు ఒక గ్యాస్​ సిలిండర్​పై రూ. 300 సబ్సిడీ ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది పుదుచ్చేరి సర్కార్.

LPG Gas Cylinder Price: రూ.300 తగ్గిన గ్యాస్​ సిలిండర్ ధర.. ప్రజలకు అక్కడి సర్కార్​ బంపర్ గిఫ్ట్..
ఇదే కాకుండా గ్యాస్ సిలింగడర్ రెండ్ కలర్‌లో ఉండడం సైన్స్‌తో కూడా ముడిపడి ఉంది. ఎరుపు రంగును దూరంగా ఉన్నా సులభంగా గుర్తించవచ్చు. ఇతర రంగులను గుర్తించడం కొంత కష్టంగా ఉన్నా ఎరుపు రంగులను గుర్తించడం సులభం.
Follow us on

గ్యాస్​ వినియోగదారులకు పుదుచ్చేరి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రోజు రోజుకు పెరుగుతున్న గ్యాస్​ ధరలతో ఇబ్బంది పడుతున్న.. పుదుచ్చేరి ప్రజలకు భారీ ఉపశమనం కలిగించింది. ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​పై రూ.300 వరకు సబ్సిడీని అందిస్తున్నట్లుగా ప్రకటించారు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్​ రంగస్వామి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్​లో ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు ఒక సిలిండర్​పై రూ.300 సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ఈ పథకానికి బడ్జెట్​లో రూ. 126 కోట్లు కేటాయించామని రంగస్వామి వెల్లడించారు.

2023-24 సంవత్సరానికి సమర్పించిన యుటి బడ్జెట్‌లో ముఖ్యమంత్రి ఎన్ రంగసామి ప్రకటించారు. వివిధ శాఖల విజయాలను వివరించిన రంగస్వామి మాట్లాడుతూ అన్ని కుటుంబాలకు నెలకు ఒక సిలిండర్‌కు రూ.300 సబ్సిడీని అందించే పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రూ.126 కోట్లు కేటాయించిందని తెలిపారు.

11,600 కోట్ల పన్ను రహిత బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. LPG సబ్సిడీ కార్యక్రమం కుటుంబ రేషన్ కార్డులను కలిగి ఉన్న అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. వివిధ దేశాలకు చెందిన తమిళ పండితుల భాగస్వామ్యంతో ప్రభుత్వం ఇక్కడ “ప్రపంచ తమిళ సదస్సు”ను కూడా నిర్వహిస్తుందని సిఎం చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం