మాస్కో.. ‘పరేడ్’ లో భారత దళాల కవాతు.. ఎంతో గర్వంగా ఉంది.. రాజ్ నాథ్ సింగ్

మాస్కోలో బుధవారం జరిగిన ‘విక్టరీ డే పరేడ్’ లో మన సాయుధ దళాలు పాల్గొనడం తనకెంతో గర్వ కారణంగా ఉందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ‘ఇది నాకు హ్యాపీ మూమెంట్’ అని ట్వీట్ చేశారు. రష్యా రక్షణ శాఖ ఆహ్వానంపై ఆయన… మాస్కోలోని రెడ్ స్క్వేర్ లో జరిగిన 75 వ’విక్టరీ డే పరేడ్’ కార్యక్రమానికి హాజరయ్యారు. 1941-1945 మధ్య నాజీ జర్మనీతో జరిగిన రెండో ప్రపంచ యుధ్ధంలో  నాటి సోవియట్ రష్యా […]

మాస్కో.. 'పరేడ్' లో భారత దళాల కవాతు.. ఎంతో గర్వంగా ఉంది.. రాజ్ నాథ్ సింగ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 24, 2020 | 5:03 PM

మాస్కోలో బుధవారం జరిగిన ‘విక్టరీ డే పరేడ్’ లో మన సాయుధ దళాలు పాల్గొనడం తనకెంతో గర్వ కారణంగా ఉందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ‘ఇది నాకు హ్యాపీ మూమెంట్’ అని ట్వీట్ చేశారు. రష్యా రక్షణ శాఖ ఆహ్వానంపై ఆయన… మాస్కోలోని రెడ్ స్క్వేర్ లో జరిగిన 75 వ’విక్టరీ డే పరేడ్’ కార్యక్రమానికి హాజరయ్యారు. 1941-1945 మధ్య నాజీ జర్మనీతో జరిగిన రెండో ప్రపంచ యుధ్ధంలో  నాటి సోవియట్ రష్యా విజయం సాధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ పరేడ్ జరుగుతోందని, ఇందులో త్రివిధ భారత దళాలు పాల్గొనడమే గాక.. వారు చేసిన కవాతు ఎంతో ఇంప్రెసివ్ గా ఉందని రాజ్ నాథ్ సింగ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. చైనా, ఇండియాతో బాటు 11 దేశాల నుంచి సాయుధ దళాలు ఈ పరేడ్ లో పాల్గొన్నాయి.

కాగా-రష్యా డిప్యూటీ పీఎం తో రాజ్ నాథ్ సింగ్ జరిపిన సమావేశంలో.. భారత-రష్యా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఇండో-చైనా సంబంధాల గురించి ప్రస్తావించిన ఆయన.. తమకు ఏ దేశంతోనూ విభేదాలు లేవని, శాంతిని కోరుకునే ఇండియా తన అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలనే అభిలషిస్తోందని స్పష్టం చేశారు. ఇటీవల భారత-చైనా దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల పరిష్కారానికి తాము కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..