Rail Roko on Feb 18: పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తోన్న రైతన్నలు .. ఈనెల 18 న రైలు రోకోకు పిలుపు

|

Feb 10, 2021 | 9:03 PM

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేసేవరకూ తమ పోరు ఆగదని రైతు సంఘాలు తేల్చి చెప్పేశాయి. అంతేకాదు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇటీవల రహదారుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా..

Rail Roko on Feb 18: పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తోన్న రైతన్నలు .. ఈనెల 18 న రైలు రోకోకు పిలుపు
Follow us on

Rail Roko on Feb 18: కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేసేవరకూ తమ పోరు ఆగదని రైతు సంఘాలు తేల్చి చెప్పేశాయి. అంతేకాదు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇటీవల రహదారుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘాల నేతలు.. తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. సింఘూ సరిహద్దు వద్ద సమావేశమైన సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ నెల 18న దేశవ్యాప్తంగా రైల్‌ రోకో కార్యక్రమానికి పిలుపు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ దేశ వ్యాప్తంగా రైళ్లను అడ్డుకోవాలని చెప్పారు. ఈ మేరకు సంయుక్త కిసాన్‌ మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు ఈ నెల 12 నుంచి రాజస్థాన్‌లోని అన్ని టోల్‌ ప్లాజాల వద్ద టోల్‌ కలెక్షన్‌ను కొనసాగనీయబోమని తెలిపింది. పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు నివాళిగా ఈ నెల 14న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.

Also Read:

ప్రధాన మంత్రిగా ఉండి కూడా కారు కోసం లోన్ తీసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి.. ఆ లోన్ తీర్చకుండానే మృతి.. ఆపై

కీలక ప్రకటన చేసిన ఆంధ్రప్రేదశ్ వైద్య ఆరోగ్యశాఖ.. కరోనా టీకా సెకండ్ డోస్ ఎప్పటి నుంచంటే..