
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ ఇన్‌ఛార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం రాబంకి నుంచి ‘ప్రతిజ్ఞ యాత్ర’ ప్రారంభించారు. వచ్చే ఏడాది యూపీలో ఎన్నికలకు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు పార్టీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్రను మొదలు పెట్టారు. 12వ తరగతి పాసైన బాలికలకు స్మార్ట్‌ఫోన్‌లు, గ్రాడ్యుయేట్ బాలికలకు ఈ-స్కూటీతోపాటు ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు ఇస్తామని ప్రజలకు వివరిస్తున్నారు.
“మా మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్య వాగ్దానాలు పాఠశాల బాలికలకు ఉచిత ఇ-స్కూటీ, మొబైల్ ఫోన్లు, వ్యవసాయ రుణాల మాఫీ, పేద కుటుంబాలకు సంవత్సరానికి రూ. 25,000, అందరికీ విద్యుత్ బిల్లు సగం, కోవిడ్ కాలం యొక్క పెండింగ్ విద్యుత్ బిల్లులను పూర్తిగా మాఫీ చేయడం” అని ప్రియాంక చెప్పారు. ఒకేసారి మూడు చోట్ల యాత్రలు చేస్తున్నారు. వారణాసి నుండి రాయ్ బరేలీ వరకు చేపట్టే యాత్రకు మాజీ ఎంపీ ప్రమోద్ తివారీ నాయకత్వం వహిస్తారు. బారాబంకి-బుందేల్‌ఖండ్ మార్గానికి పీఎల్ పునియా, కేంద్ర మాజీ మంత్రి ప్రదీప్ జైన్ ఆదిత్య నాయకత్వం వహిస్తారు. సహరన్పూర్-మధుర మార్గంలో మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, పార్టీ సీనియర్ నాయకుడు ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ నాయకత్వం వహిస్తారు. మూడు యాత్రలు నవంబర్ 1 వరకు జరుగుతాయి.
ఈ యాత్రల సమయంలో కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టో ప్రజలకు తెలియజేస్తుంది. 12 వేల కిలోమీటర్ల మేర యాత్రలు సాగనున్నాయి. యాత్రలో వివిధ విలేకరుల సమావేశాలు, ”నుక్కడ్ సభలు”, ఆలయ సందర్శనలు, రోడ్‌షోలు, జనసభలు మొదలైనవి జరుగుతాయి. ఈ నెల ప్రారంభంలో లఖింపూర్ ఖేరిలో నలుగురు రైతుల మరణంతో సహా అనేక సమస్యలపై ప్రియాంక గాంధీ వాద్రా యూపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ వారం పోలీసు కస్టడీలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని సందర్శించడానికి ప్రయత్నించిన తర్వాత ఆమెను (ఒక నెలలో రెండోసారి) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
कांग्रेस की सात प्रतिज्ञाएं
“हम वचन निभाएंगे
हर वचन निभाएंगे”#कांग्रेस_की_प्रतिज्ञाएँ pic.twitter.com/AZ1PSwUo2L— UP Congress (@INCUttarPradesh) October 23, 2021
Read Also.. NV Ramana: కోర్టుల్లో మౌలిక వసతులు కల్పనకు కేంద్ర న్యాయశాఖ చొరవ చూపాలి