PM Modi: అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోడీ వర్చువల్‌ భేటీ.. ఆ అంశంపైనే కీలక చర్చ..

|

Apr 10, 2022 | 8:45 PM

PM Modi-Biden meeting: ఉక్రెయిన్‌లో భీకరయుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో వర్చువల్‌గా భేటీ అవుతున్నారు ప్రధాని మోదీ. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు రక్షణ , ఆర్ధిక రంగాల్లో సహకారంపై కూడా ఇద్దరు నేతలు చర్చిస్తారు.

PM Modi: అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోడీ వర్చువల్‌ భేటీ.. ఆ అంశంపైనే కీలక చర్చ..
Prime Minister Narendra Mod
Follow us on

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో(US President Joe Biden) సోమవారం వర్చువల్‌గా భేటీ అవతున్నారు ప్రధాని మోదీ(PM Modi). ఉక్రెయిన్‌పై భారత్‌ తటస్థ వైఖరితో ఉన్న సమయంలో మోదీ-బైడెన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పలు అంశాలు ఇద్దరు నేతలు చర్చించబోతున్నారు. దక్షిణాసియాతో పాటు ఫసిఫిక్‌ ప్రాంతంలో తాజా పరిస్థితిపై చర్చలు జరుపుతారు. అంతర్జాతీయ స్థాయిలో ఇరుదేశాల మధ్య మరింత భాగస్వామ్యం పెరిగేలా చర్యలు తీసుకోబోతున్నారు. రక్షణరంగం , ఆర్ధికరంగాల్లో సహకారంపై కూడా మోదీ-బైడెన్‌ మధ్య చర్చలు జరుగుతాయి. అమెరికా, భారత విదేశాంగశాఖ , రక్షణశాఖ మంత్రుల మధ్య కూడా అతిత్వరలో చర్చలు జరుగుతాయి. కోవిడ్‌పై పోరాటంలో భారత్‌ తమకు చాలా సహకరించిందని తెలిపారు బైడెన్‌. ఇండో -పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి ఏర్పాటుకు కృషి చేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.

రక్షణరంగం , ఆర్ధికరంగాల్లో సహకారంపై కూడా మోదీ-బైడెన్‌ మధ్య చర్చలు జరుగుతాయి. అమెరికా, భారత విదేశాంగశాఖ , రక్షణశాఖ మంత్రుల మధ్య కూడా అతిత్వరలో చర్చలు జరుగుతాయి. కోవిడ్‌పై పోరాటంలో భారత్‌ తమకు చాలా సహకరించిందని తెలిపారు బైడెన్‌. ఇండో -పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి ఏర్పాటుకు కృషి చేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.

ఉక్రెయిన్‌ యుద్దం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. దీనిపై కూడా ఇద్దరు నేతలు చర్చించబోతున్నారు.

ఇవి కూడా చదవండి: Gudivada Amarnath: కార్పోరేటర్‌ నుంచి మంత్రి వరకు.. విశాఖ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌‌కు జగన్ కేబినెట్‌లో చోటు..

TRS: “ఛలో ఢిల్లీ..” టీఆర్‌ఎస్‌ దీక్షకు అంతా రెడీ.. తెలంగాణ భవన్‌లో భారీ ఏర్పాట్లు..