Vande Bharat Trains: పట్టాలెక్కనున్న మరో 5 వందేభారత్ రైళ్లు
కేంద్ర రైల్వేశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ రైళ్లపై ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. అందుకే కేంద్ర రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వందేభారత్ రైళ్లపై జనాధారణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రైళ్ల సంఖ్యను మరింత పెంచుతోంది.

కేంద్ర రైల్వేశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ రైళ్లపై ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. అందుకే కేంద్ర రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వందేభారత్ రైళ్లపై జనాధారణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రైళ్ల సంఖ్యను మరింత పెంచుతోంది. అయితే ఇప్పటికే దాదాపు 17 రూట్లలో వందేభారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. తాజాగా మరో ఐదు రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యాయి. వీటన్నింటిని ఒకే రోజు ప్రారంభించేలా రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మంగళవారం రోజున ఉదయం 10.30 AM గంటలకు ప్రధాని మోదీ ఈ ఐదు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఐదు వందేభారత్ రైళ్లలో రెండు రైళ్లు మధ్యప్రదేశ్ నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే మరో మూడు రైళ్లు కర్ణాటక, గోవా, బిహార్‌ల నుంచి ప్రారంభం కానున్నాయి. నూతనంగా ప్రారంభించనున్న ఈ ఐదు రైళ్లతో కలిపి వందే భారత్ రైళ్ల సంఖ్య మొత్తం 24 కు చేరుకోనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




