PM Modi: ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరిస్తున్న కమలం.. సంగ్మా ప్రమాణానికి ప్రధాని మోదీ..

|

Mar 05, 2023 | 9:05 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆ రాష్ట్రాలకు వెళ్లనున్నారు. ఆ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఇతర నేతల ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.

PM Modi: ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరిస్తున్న కమలం.. సంగ్మా ప్రమాణానికి ప్రధాని మోదీ..
PM Modi
Follow us on

ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ తన ఉనికిని వేగంగా విస్తరించుకుంటోంది. ఇటీవల జరిగిన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి విజయం సాధించి అధికారాన్ని మరోసారి దక్కించుకుంది. ఆయా రాష్ట్రాల్లో త్వరలోనే తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆ రాష్ట్రాలకు వెళ్లనున్నారు. ఆ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఇతర నేతల ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. నాగాలాండ్‌ , త్రిపుర లో బీజేపీ కూటమి విజయం సాధించగా మేఘాలయలో హంగ్‌ ఏర్పడింది. అయితే తాజాగా మేఘాలయ సంకీర్ణ సర్కారులో బీజేపీ కూడా చేరనుంది.

తనకు బీజేపీ సభ్యులు కూడా మద్దతిచ్చారంటూ నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా మద్దతు లేఖలతో మేఘాలయ గవర్నర్ ఫాగు చౌహాన్‌‌కు సమర్పించారు. తనకు బీజేపీతో పాటు హెచ్ఎస్‌పీడీపీ సభ్యులు, ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా మద్దతిచ్చారంటూ ఆయన వారు ఇచ్చిన మద్దతు లేఖలను గవర్నర్‌కు సమర్పించిన సంగతి తెలిసిందే.

మేఘాలయ రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్ర సీఎం కాన్రాడ్‌ సంగ్మాకు చెందిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థులు 26 స్థానాల్లో గెలిచారు. ఆ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించింది ఎన్‌పీపీ . యూడీపీ 11 స్థానాల్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ 5, బీజేపీ 2 చోట్ల గెలిచాయి. మ్యాజిక్‌ ఫిగర్‌ 31 కాగా కాన్రాడ్‌ సంగ్మా‌కు బీజేపీ కూడా మద్దతునీయడంతో త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలోనూ బీజేపీ అధికారం దక్కినట్లే.. జరిగిన మూడు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాల్లోనూ బీజేపీ కొలువుతీరనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం