దేశ భవిష్యత్తుపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. వచ్చే 27 ఏళ్ళు కీలకమన్న పీఎం.. అవునన్న రతన్ టాటా

|

Dec 19, 2020 | 1:31 PM

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక వారోత్సవాలనుద్దేశించి...

దేశ భవిష్యత్తుపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. వచ్చే 27 ఏళ్ళు కీలకమన్న పీఎం.. అవునన్న రతన్ టాటా
Follow us on

Prime Minister Narendra Modi sensational comments: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక వారోత్సవాలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. అంతర్జాతీయంగా భారత దేశం భవిష్యత్తులో నిర్వహించబోయే పాత్రపై మోదీ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘ ఆర్థిక సంస్కరణలకు ముందు భారత్‌లో పెట్టుబడి పెట్టే వారు ఇండియానే ఎందుకు? అని ప్రశ్నించే వారని.. ఆర్థిక సంస్కరణల ఫలితాలు చూసిన తర్వాత వారే.. ఇండియా ఎందుకు కాదు? అని ప్రశ్నిస్తున్నారు..’’ అని మోదీ వ్యాఖ్యానించారు. వచ్చే 27 సంవత్సరాలు మన దేశానికి అత్యంత కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ కాలం అంతర్జాతీయంగా ఇండియా నిర్వహించబోయే పాత్రను నిర్దేశిస్తుందన్నారు.

ఈ సదస్సులోనే వాణిజ్య దిగ్గజం రతన్ టాటాకు అసోచామ్ ఎంటర్‌ప్రైజ్ ఆఫ్ ది సెంచురీ అవార్డును ప్రధాన మంత్రి బహూకరించారు. టాటా గ్రూపు సంస్థల తరపున రతన్‌ టాటా ఈ అవార్డును అందుకున్నారు. భారత దేశ నవ నిర్మాణంలో టాటా సంస్థ పాత్రను మోదీ ప్రశంసించారు. ప్రధాని వ్యాఖ్యలపై స్పందించిన రతన్‌ టాటా.. కరోనా పాండమిక్ సమయంలో పీఎం మోదీ నిర్వర్తించిన పాత్రను కొనియాడారు.