మాలేగాం పేలుడు కేసు విచారణ వేగవంతం.. కోర్టుకు హాజరుకావాలని ప్రగ్యా సాధ్వీజీకి సమన్లు..

మాలేగాం పేలుళ్ల కేసుకు సంబంధించి బీజేపీ ఎంపీ ప్రగ్యాఠాకూర్ ట్రయల్ కోర్టు విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మాలేగాం పేలుడు కేసులో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సుధీర్ఘ కాలం తర్వాత ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విచారణ ముమ్మరం చేసింది.

మాలేగాం పేలుడు కేసు విచారణ వేగవంతం.. కోర్టుకు హాజరుకావాలని ప్రగ్యా సాధ్వీజీకి సమన్లు..
Follow us

|

Updated on: Dec 19, 2020 | 1:47 PM

మాలేగాం పేలుళ్ల కేసుకు సంబంధించి బీజేపీ ఎంపీ ప్రగ్యాఠాకూర్ ట్రయల్ కోర్టు విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మాలేగాం పేలుడు కేసులో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సుధీర్ఘ కాలం తర్వాత ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో సాక్షులను పిలవాలని కోర్టు నిర్ణయించింది. ఈ కేసులో నిందితులైన ఏడుగురు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 2008లో మాలేగాం పట్టణంలోని మసీదు సమీపంలో మోటారుసైకిలులో పేలుడు పరికరం ఉంచి పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరో వందమంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ నిందితురాలుగా ఉన్నారు. అయితే, అనారోగ్య కారణాలు చూపిస్తూ ముంబై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విచారణకు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ప్రగ్యా ఠాకూర్ కోర్టుకు విన్నవించుకుంది.

ఇదిలావుండగా, ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్, రమేష్ ఉపాధ్యాయ, సుధాకర్ దివేది, సుధాకర్ చతుర్వేదిలు కోర్టుకు హాజరుకాలేదు. కొవిడ్ -19 ఆంక్షల వల్ల వారు కోర్టుకు హాజరు కాలేక పోయారని వారి తరపున న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. దీంతో మళ్లీ డిసెంబరు 19వతేదీన నిందితులందరినీ హాజరుకావాలని కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. దీంతో ఎంపీ ప్రగ్యాసింగ్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేరారని అతని న్యాయవాది చెప్పారు.

ప్రగ్యా సాధ్వీజీ ముంబైకు రావాలని నిర్ణయించుకొని విమానాశ్రయానికి సమీపంలోని నందగిరి గెస్టుహౌస్ ను బుకింగ్ చేశారని, కాని ఆమెకు రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేరమని కోరారని ఆమె తరపున న్యాయవాది జేపీ మిశ్రా చెప్పారు. ప్రగ్యా ఠాకూర్ గతంలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి కంటి ఆపరేషన్ చేయించుకున్నారు.

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!