కోల్‌కత్తాలో భారీ అగ్ని ప్రమాదం.. కిరోసిన్ డబ్బాలు అంటుకుని ఎగిసిపడ్డ మంటలు.. ముగ్గురు సజీవదహనం
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో శనివారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమైనట్లు ఫైర్ సిబ్బంది....
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో శనివారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమైనట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఓ దుకాణంలో నిల్వ ఉంచిన కిరోసిన్ డ్రమ్ములకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో భారీగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. కోల్‌కత్తాకు 20 కిలోమీటర్ల దూరంలోగల భంగర్ పట్టణంలోని ఘటక్‌పకర్ బజార్ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
అయితే దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు పక్కనే ఉన్న మరో దుకాణానికి, టిఫిన్ సెంటర్‌కు, ఓ ఇంటికి అంటుకున్నాయి. దీంతో అందరూ భయాందోళనతో బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే 50 ఏళ్లుగా టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తున్న యజమాని ఇద్దరు పిల్లలు దుకాణంలోని విలువైన వస్తువులను కాపాడుకునేందుకు లోపలికి వెళ్లగా మంటలకు సజీవదహనం కాగా, మరో దుకాణంలో ఒకరు సజీవదహనం అయ్యాడు.
ప్రమాద విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించడంతో మూడు ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని ఐదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. దుకాణంలో కిరోసిన్ డబ్బులు ఉండటంతో ప్రమాదవశాత్తు మంటలు మరింతగా వ్యాపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాంద జరిగిందా..? లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా..? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.