PM Narendra Modi: నేడు గ్లోబల్ పాటిదార్ బిజినెస్ సమ్మిట్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

|

Apr 29, 2022 | 6:00 AM

గ్లోబల్ పాటిదార్ బిజినెస్ సమ్మిట్‌(Global Patidar Business Summit) ను ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు.

PM Narendra Modi: నేడు గ్లోబల్ పాటిదార్ బిజినెస్ సమ్మిట్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..
Prime Minister Narendra Modi
Follow us on

గుజరాత్‌లోని సూరత్‌ (Surat)లో ప్రపంచ పాటీదార్ సమాజ్‌కు చెందిన ‘ సర్దార్‌ధామ్’లో మూడు రోజులపాటు నిర్వహించనున్న గ్లోబల్ పాటిదార్ బిజినెస్ సమ్మిట్‌(Global Patidar Business Summit) ను ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (Prime Minister Office) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. పీఎంవో ప్రకారం, ‘సర్దార్ ధామ్’ ఈ కార్యక్రమాన్ని ‘మిషన్ 2026’ కింద నిర్వహిస్తోంది. దీని వెనుక పాటిదార్ సమాజం ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి ఈ సదస్సు నిర్వహిస్తారు. గాంధీనగర్‌లో 2018, 2020లో మొదటి రెండు సదస్సులు జరిగాయి.

ఈ GPBS-2022 ప్రధాన థీమ్ ‘స్వయం-ఆధారమైన గుజరాత్, భారతదేశానికి స్వీయ-ఆధారిత సంఘం’గా పేర్కొన్నారు. ఈ ప్రకటన ప్రకారం, ఈ మూడు రోజుల (ఏప్రిల్ 29 నుంచి మే 1 వరకు) సదస్సు లక్ష్యం పాటిదార్ సొసైటీలోని చిన్న, మధ్య, బడా పారిశ్రామికవేత్తలను ఏకతాటిపైకి తీసుకురావడం, వారిని ప్రోత్సహించడం, కొత్త పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడంతోపాటు విద్యావంతులైన యువతకు శిక్షణ, ఉపాధి కల్పించడం లాంటివి చేయనున్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అంకితం చేసిన ‘సర్దార్ ధామ్’ విద్యా, సామాజిక పరివర్తన, సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాలను అందించడానికి కృషి చేస్తోందని పేర్కొంది.

జాతికి అంకితం..

ఈనెల ప్రారంభంలో అంటే ఏప్రిల్ 15న, దేశంలోని ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల నిర్మాణ లక్ష్యంగా వైద్య విద్యను విశ్వవ్యాప్తం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమాలు దేశంలోనే రికార్డును సృష్టిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే 10 సంవత్సరాలలో కొత్త వైద్యులు సంఖ్యాపరంగా కీలకపాత్ర పోషించనున్నారు. భుజ్‌లోని 200 పడకల కేకే పటేల్ ఛారిటబుల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేసిన అనంతరం మోదీ ప్రసంగిస్తూ, కరోనావైరస్ మరోసారి మెరుపుదాడి ఉందని, కాబట్టి ప్రజలు దానిని తేలికగా తీసుకోవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మెరుగైన వైద్య సదుపాయాలు కేవలం వ్యాధుల చికిత్సకే పరిమితం కాకుండా సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. పేదవాడికి చౌకగా, ఉత్తమమైన చికిత్స లభించినప్పుడు, వ్యవస్థపై వారికి నమ్మకం మరింత బలపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌లో దాదాపు 1,100 సీట్లతో తొమ్మిది మెడికల్ కాలేజీలు ఉండేవని, అయితే గత 20 ఏళ్లలో వైద్య విద్య రంగంలో అపారమైన మార్పు వచ్చిందని ప్రధాని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Hindi language Row: దేశవ్యాప్తంగా రాజుకంటున్న భాషా వివాదం.. పులుముకుంటున్న రాజకీయరంగు!

Viral: పోర్ట్‌లో అనుమానాస్పదంగా పైపుల లోడ్.. లోపల చెక్ చేసి స్టన్ అయిన పోలీసులు