Modi UAE Tour: ప్రధాని మోదీ ఫస్ట్ విదేశీ టూర్ క్యాన్సిల్.. కారణమేంటంటే..!

|

Dec 29, 2021 | 9:49 PM

Modi UAE Tour: 2022లో ప్రధాని మోదీ ఫస్ట్‌ విదేశీ టూర్‌ క్యాన్సిల్‌ అయ్యింది. వివరాల్లోకెళితే.. వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన ప్రధామంత్రి నరేంద్రమోదీ యూఏఈ వెళ్లాల్సి ఉంది.

Modi UAE Tour: ప్రధాని మోదీ ఫస్ట్ విదేశీ టూర్ క్యాన్సిల్.. కారణమేంటంటే..!
Follow us on

Modi UAE Tour: 2022లో ప్రధాని మోదీ ఫస్ట్‌ విదేశీ టూర్‌ క్యాన్సిల్‌ అయ్యింది. వివరాల్లోకెళితే.. వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన ప్రధామంత్రి నరేంద్రమోదీ యూఏఈ వెళ్లాల్సి ఉంది. కానీ ఒమిక్రాన్ భయం కారణంగా ప్రధాని యూఏఈ పర్యటన వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభిస్తోండటంతో ఈ పర్యటన వాయిదా వేసినట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. భారత్-యూఏఈ మధ్య దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన ఖరారు చేశారు అధికారులు. 2022లో ఇదే ప్రధాని తొలి విదేశీ పర్యటన కావడం గమనార్హం. ఒకవేళ పర్యటనకు వెళ్తే, దుబాయ్ ఎక్స్‌పోలో ప్రధాని మోదీ పాల్గొనేవారు. వాతావరణం, జీవవైవిధ్యం, అంతరిక్షం, పట్టణ, గ్రామీణ అభివృద్ధి, ప్రపంచలక్ష్యాలు, ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయం, జీవనోపాధిపై యూఏఈతో మోదీ చర్చలు జరపాల్సి ఉంది. ఇంతకుముందు 2015, 2018, 2019లో యూఏఈని సందర్శించారు ప్రధాని మోదీ. యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయేద్‌ను కూడా స్వీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషి యూఏఈ ఈ పురస్కారంతో సత్కరించింది. ఇప్పటి వరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌, క్వీన్ ఎలిజబెత్‌-2, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సహా మరికొందరు ప్రపంచనేతలకు ఈ అవార్డును ప్రదానం చేశారు యూఏఈ పాలకులు. భారత్‌తో యూఏఈకి మంచి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. భారత్‌కు యూఏఈ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. మరో విశేషం ఏంటంటే, యూఏఈలో దాదాపు 30 శాతం మంది భారతీయులే ఉన్నారు.

Also read:

Telangana: తెలంగాణకు వెల్లువలా పెట్టుబడులు.. ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న అమూల్‌..

Corona Virus: శ్రీచైతన్య జూనియర్ కాలేజి క్యాంపస్‌లో కరోనా కలకలం… 34 మంది విద్యార్థులకు కరోనా.. ఆందోళనలో తల్లిదండ్రులు

TRS Group War: పాలేరు గులాబీలో ముదురుతున్న వార్.. తుమ్మల వర్సెస్ కందాల.. అసలు కథ ఇదే..