రైతుల సమస్యలపై దేశీయ, విదేశీ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై దర్యాప్తు జరుపుతామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిపై ఇన్వెస్టిగేషన్ జరపాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. సచిన్ సావంత్ తదితర నేతల డిమాండ్ ను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఇందుకు అంగీకరించారు. అమెరికా పాప్ సింగర్ రిహానా చేసిన ట్వీట్ల అనంతరం అనేకమంది ఒకే విధమైన ట్వీట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా బీజేపీ ఒత్తిడితో వీరంతా ఇలా స్పందించినట్టు కనబడుతోందని సావంత్ అన్నారు. ఈ సెలబ్రిటీల్లో చాలామంది ‘ఏమికబుల్’ అనే పదాన్ని వాడారని ఆయన అన్నారు. అక్షయ్ కుమార్, సైనా నెహ్వాల్ వంటివారు ఇలాగె ట్వీట్స్ చేశారని ఆయన పేర్కొన్నారు. సునీల్ శెట్టి కూడా ఓ బీజేపీ నేత పేరును ట్యాగ్ చేశారన్నారు . ప్రభుత్వం వీరిపై ఒత్తిడి తెచ్చి ఇలా ట్వీట్స్ చేయాల్సిందిగా కనబడుతోందన్నారు. కాగా దీనిపై దర్యాప్తు జరిపిస్తామని అనిల్ దేశ్ ముఖ్ అన్నారు.
Read More:క్షమాపణ చెప్పను, జరిమానా కట్టను, ఏం చేస్తారు ? అవే ట్వీట్లు ! ధిక్కరించిన కునాల్ కమ్రా
Read More:కేరళలో దారుణం, ‘అల్లా’కు తన ఆరేళ్ళ కొడుకును బలి ఇచ్చిన తల్లి, అరెస్టు చేసిన పోలీసులు