Ram Nath Kovind Health Update: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు మంగళవారం ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీకి సంబంధించిన సన్నాహాలు జరగనున్నట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. 75 ఏళ్ల వయసున్న కోవిండ్ శుక్రవారం ఉదయం ఛాతీ నొప్పితో ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం కోవింద్‌ను ఆర్మీ ఆసుపత్రిలో పరామర్శించారు.
అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై తదుపరి పరీక్షలు, పరిశీలన కోసం, మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు పంపించబడ్డారని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ శనివారం మధ్యాహ్నం తెలిపింది. రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు నేతలు వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రధాని మోదీ కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుమారుడితో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నట్లు పీఎంఓ ట్వీట్ చేసింది.
Also Read: పురావస్తుశాఖ తవ్వకాల్లో దొరికిన 7 విచిత్రమైన లడ్డూలు.. పరిశోధనలో విస్తుపోయే విషయాలు
ఏపీలో కరోనా స్వైర విహారం.. కొత్తగా 947 పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది