Droupadi Murmu Swearing Highlights: భారతదేశానికి ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ హాలులో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణ చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ, రాంనాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, గవర్నర్, ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వంలోని ప్రముఖ సివిల్, మిలటరీ అధికారులు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు అయ్యారు.
ద్రౌపది ముర్ము 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆమె తొలి ప్రసంగం చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో వేడుక ముగిసిన తర్వాత, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరుతారు. కాగా, 2017లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రాంనాథ్ కోవింద్ పదవీ కాలం ముగిసింది. నిన్న ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ముర్ము ప్రమాణ స్వీకారం తర్వాత పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. ఆమెతో పాటు రాంనాథ్ కోవింద్ కూడా ఉన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రక్షక దళం ఆయనకు గౌరవ వందనం అందించింది. ముర్ముకి 21 గన్ సెల్యూట్ చేశారు. ఆమె వెంట మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఉన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పార్లమెంటులో ప్రసంగిస్తూ దేశప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఆమె తన కాన్వాయ్‌తో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
వార్డు కౌన్సిలర్ నుంచి రాష్ట్రపతి వరకు వచ్చానని భారత 15వ రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సందర్భంగా ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆదివాసీ గ్రామం నుంచి నా ప్రయాణం మొదలైందని అన్నారు. రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. మా గ్రామంలో పదో తరగతి చదువుకున్న బాలికగా నేనేనని అన్నారు. రాష్ట్రపతిగా ఎన్నిక కావడం నా వ్యక్తిగత విజయం కాదని, ఆదివాసీ, దళితుల విజయమన్నారు. దేశ అత్యున్నత పదవికి ఎన్నిక కావడం ధన్యవాదాలు తెలిపారు.
ఎన్ని ఇబ్బందులున్నా సంకల్పంతో ముందుకెళ్లాలని ద్రౌపది ముర్ము అన్నారు. వచ్చే 25 ఏళ్లలో అద్భుమైన పురోగతి సాధించాలన్నారు. ఒకప్పుడు చదువుకోవడం నా కల.. ఇప్పుడు రాష్ట్రపతి అయ్యాను అని అన్నారు.
మీ విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ ప్రజలకు కార్గిల్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు ప్రశంసలు కురిపించారు. నాపై మీరు ఉంచిన నమ్మకమై నా బలమని అన్నారు.
భారత రాష్ట్రపతిగా ఎన్నుకున్నందుకు రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము.. పార్లమెంట్‌లో తొలి ప్రసంగం చేస్తున్నారు.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రపతిగా సంతకం చేశారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేయించారు.
రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి రాంనాథ్ కోవింద్, వెంకయ్యనాయుడుతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర దేశాల నేతలు హాజరయ్యారు.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ ఎన్వీ రమణ ముర్ముచే ప్రమాణ స్వీకారం చేయించారు.
ద్రౌపది ముర్ము, రాంనాథ్ కోవింద్‌లు పార్లమెంట్ భవన్కు చేరుకున్నారు. కాసేపట్లో సీజేఐ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ముఏచ 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ద్రౌపది ముర్ము పార్లమెంట్‌కు చేరుకున్నారు. కొద్దిసేపట్లో ఆమె 15రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ ఉదయం పార్లమెంట్ హౌస్‌లో ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. అంతకుముందు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఆమె దేశానికి రెండో మహిళా అధ్యక్షురాలు కానున్నారు. అదే సమయంలో దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా అత్యున్నత పదవిని అధిష్టించిన అధ్యక్షురాలు కూడా.
వివిధ దేశాల నుంచి దౌత్యవేత్తలు పార్లమెంటు భవనానికి చేరుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ద్రౌపది ముర్ము తన నివాసం నుంచి రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరారు.
15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ముర్ము తన ఇంటి నుంచి రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరారు. అక్కడి నుంచి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు బయలుదేరి ప్రమాణ స్వీకారం చేస్తారు.
నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారానికి ముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించనున్నారు.
కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఉదయం 10:15 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరగనుంది. అనంతరం ఆమె పార్లమెంటులో ప్రసంగిస్తారు. ఈ కొత్త రాష్ట్రపతికి 21 గన్ సెల్యూట్ ఉంటుంది.