Droupadi Murmu: వార్డు కౌన్సిలర్‌ నుంచి రాష్ట్రపతి వరకు వచ్చా..: ద్రౌపది ముర్ము

|

Jul 25, 2022 | 10:57 AM

Droupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి..

Droupadi Murmu: వార్డు కౌన్సిలర్‌ నుంచి రాష్ట్రపతి వరకు వచ్చా..: ద్రౌపది ముర్ము
Droupadi Murmu
Follow us on

Droupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చేయించారు.ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రాంనాత్‌ కోవింద్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, గవర్నర్‌, ముఖ్యమంత్రి, పార్లమెంట్‌ సభ్యులు, మంత్రులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ద్రౌపది ముర్ము తొలిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత రాష్ట్రపతిగా ఎన్నుకున్నందుకు రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మీ విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానని అన్నారు. దేశ ప్రజలకు కార్గిల్‌ విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌కు ప్రశంసలు కురిపించారు. నాపై మీరు ఉంచిన నమ్మకమై నా బలమని వ్యాఖ్యానించారు.

ఎన్ని ఇబ్బందులున్నా సంకల్పంతో ముందుకెళ్లాలని, వచ్చే 25 ఏళ్లలో అద్భుమైన పురోగతి సాధించాలన్నారు. ఒకప్పుడు చదువుకోవడం నా కల.. ఇప్పుడు రాష్ట్రపతి అయ్యాను అని చెప్పుకొచ్చారు. కౌన్సిలర్‌ నుంచి రాష్ట్రపతి వరకు వచ్చానని, ఆదివాసీ గ్రామం నుంచి నా ప్రయాణం మొదలైందని అన్నారు. రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని, మా గ్రామంలో పదో తరగతి చదువుకున్న బాలికగా నేనేనని పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ఎన్నిక కావడం నా వ్యక్తిగత విజయం కాదని, ఆదివాసీ, దళితుల విజయమన్నారు. దేశ అత్యున్నత పదవికి ఎన్నిక కావడం ధన్యవాదాలు తెలిపారు.

ప్రజాస్వామ్య శక్తి ఆమెను ఇంత దూరం తీసుకొచ్చింది. మహిళల ప్రయోజనాలే నాకు ప్రధానం. కరోనా సమయంలో భారతదేశం చాలా దేశాలకు సహాయం చేసింది. నవ భారతం కోసం మనం కర్తవ్య మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. అందరి కృషితో ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి